ప్రైవేటుకు దీటుగా సర్కారు బడి | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటుకు దీటుగా సర్కారు బడి

Aug 12 2026 12:52 AM | Updated on Aug 12 2026 12:52 AM

రాయచూరు రూరల్‌: నేటి ఆధునిక యగంలో విద్యా రంగానికి ఉన్న ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకుని తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రైవేట్‌ కాన్వెంట్లు, పాఠశాలల వైపు అధికంగా ఆకర్షితులవుతున్న తరుణంలో సర్కారు పాఠశాలలను ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా తీర్చిన దిద్దిన వైనం వెలుగులోకి వచ్చింది. ఉత్తర కళ్యాణలోని విజయపుర జిల్లా బబలేశ్వర తాలూకా మమదాపురలో టొయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన కర్ణాటక పబ్లిక్‌ పాఠశాలను, పాఠశాలలో సైన్సు ల్యాబరేటరీ, నూతన గదులను జిల్లా ఇంచార్జి మంత్రి ఎంబీ పాటిల్‌ అధికారులతో కలిసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ప్రతిభా వికాసానికి ఆధునిక తరగతి గదులు, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో కూడిన బోధన సామగ్రి నిర్వహణకు రూ.6 లక్షల నిధులు కేటాయించడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చింది. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆడుకోడానికి ప్రత్యేకంగా పార్కు, ఇతర పరికరాలను అమర్చారు.

మంత్రి చేతుల మీదుగా ప్రారంభం

విజయపురలో ఏర్పాటు చేసిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement