డీప్‌ టెక్‌ విప్లవానికి సంసిద్ధం: సీఎం | - | Sakshi
Sakshi News home page

డీప్‌ టెక్‌ విప్లవానికి సంసిద్ధం: సీఎం

Aug 5 2026 1:59 AM | Updated on Aug 5 2026 1:59 AM

శివాజీనగర: నానో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), సెమీ కండక్టర్లు, బయోటెక్నాలజీ, క్వాంటం టెక్నాలజీతో సహా డీప్‌ టెక్‌ కోసం బెంగళూరును ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడం ద్వారా కర్ణాటకను అగ్రగామిగా నిలపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం డీ.కే.శివకుమార్‌ తెలిపారు. బెంగళూరులోని ఓ హోటల్‌లో శాస్త్ర సాంకేతిక, నానో టెక్నాలజీ విభాగం నిర్వహించిన 14వ బెంగళూరు ఇండియా నానో కాన్ఫరెన్స్‌ను మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. బెంగళూరు భారతదేశాన్ని ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టింది, ఇప్పుడు ప్రపంచ డీప్‌–టెక్‌ పటంలో నిలబెట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తల మధ్య సహకారంతోనే ఆవిష్కరణలు వృద్ధి చెందుతాయన్నారు. కర్ణాటక ప్రముఖ పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌లకు, విశ్వవిద్యాలయాలతో కూడిన బలమైన వ్యవస్థకు కేంద్రమన్నారు. డీప్‌–టెక్‌ ఆవిష్కరణలు ప్రపంచ అగ్రగామిగా నిలవడానికి దోహదం చేస్తాయని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ, ఎలక్ట్రానిక్స్‌, ఇంధన, వ్యవసాయం, రవాణా, అంతరిక్షం, రక్షణ, అధునాతన తయారీ రంగాలను మార్చివేసే ఒక ప్రాథమిక సాంకేతికత అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement