కరావళి జిల్లాల్లో భారీ వానలు | - | Sakshi
Sakshi News home page

కరావళి జిల్లాల్లో భారీ వానలు

Aug 5 2026 1:59 AM | Updated on Aug 5 2026 1:59 AM

యశవంతపుర: రాష్ట్రంలో కరావళిలో దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో మళ్లీ భారీవర్షాలు పడుతున్నాయి. పాఠశాలలు, కాలేజీలకు జిల్లా కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఉడుపి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. రెండు జిల్లాల్లో జన జీవనం స్తంభించిపోయింది. శివమొగ్గ, చిక్కమగళూరు, కొడగు జిల్లాల్లో భారీ గాలులతో వానలు పడే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. తుంగా డ్యాంలో నీటిమట్టం 80 టీఎంసీలకు చేరినట్లు తెలిపారు. కేఆర్‌ఎస్‌ డ్యాంకూ నీరు చేరుతోంది.

బెంగళూరులో జల్లులు

బనశంకరి: కొన్నిరోజులుగా బెంగళూరులో మేఘావృతమై ఉండగా, మంగళవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో జల్లు వర్షం కురిసింది. శివారులోని నెలమంగల చుట్టుపక్కల కొద్దిమేర వర్షం కురిసింది. వానతో నగరంలో వాతావరణం చల్లబడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement