బనశంకరి: స్వాతంత్య్ర దినోత్సవం వస్తోందంటే బెంగళూరు లాల్‌బాగ్ ఉద్యానవనంలో ఫల పుష్ప ప్రదర్శన అందరికీ గుర్తుకొస్తుంది. ఈదఫా నిర్వహించే 220వ ఫ్లవర్ షో 6వ తేదీన ఆరంభమై 17 వరకూ పుష్ప ప్రేమికులకు కనువిందు చేయబోతోంది. రాష్ట్రంలో ప్రముఖ రాజవంశాలలో తొలివారైన గంగ రాజుల థీమ్‌తో ప్రదర్శనను తీర్చిదిద్దుతున్నట్లు ఉద్యానవనశాఖ కార్యదర్శి ఆర్.గిరీశ్ తెలిపారు.
సీఎంచే ప్రారంభం
6వ తేదీ ఉదయం 11 గంటలకు సీఎం డీకే.శివకుమార్ ప్రారంభిస్తారని చెప్పారు. మంగళవారం లాల్‌బాగ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గంగరాజుల గజసేన, యుద్ధ సన్నివేషాలు, శ్రావణ బెళగొళ బాహుబలి విగ్రహం, తలకాడు ఆలయాల పుష్ప నమూనాలు నిర్మాణమవుతున్నట్లు తెలిపారు. రూ.3.75 కోట్ల బడ్జెట్‌తో పనులు జరుగుతున్నట్లు చెప్పారు. పూల జలపాతం, సెల్ఫీ పాయింట్ ఈసారి ప్రత్యేకమన్నారు.
టికెట్ ధరలు ఇలా
మామూలు రోజుల్లో పెద్దలకు రూ.80 , పిల్లలకు రూ.30 టికెట్ తీసుకోవాలి. శని, ఆది, సెలవురోజుల్లో పెద్దలకు రూ.100 ఉంటుంది. 10 వ తరగతి వరకు విద్యార్థులు యూనిఫాంలో వస్తే ప్రవేశం ఉచితమని చెప్పారు. ఈసారి ఆన్‌లైన్‌లో టికెట్లను కొనుగోలు చేయవచ్చు. పార్కింగ్ వసతి, 136 సీసీ కెమరాలతో నిఘా ఉంటుంది. రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వీక్షించవచ్చు.
రేపటి నుంచే స్వాతంత్య్ర ఫ్లవర్ షో
అలరించబోతున్న కళారూపాలు


