రాయచూరు రూరల్: గురు పౌర్ణమి సందర్భంగా మంత్రాలయం మఠం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం భక్తులు సుమారు ఆరు నుంచి ఏడు గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చింది. ముఖద్వారం నుంచి రాయల బృందావనం వరకు భక్తుల క్యూలో నిలబడ్డారు. మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ భక్తులకు ఆశీర్వచనాలు అందించి దర్శనం కల్పించారు. రాయల బృందావనం చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.


