కేజీఎఫ్: గ్రామీణ విద్యా సంస్థకు చెందిన ఇంటర్ విద్యార్థులు కఠిన శ్రమ, దైహిక పరీక్షలలో నెగ్గి జాతీయ కెడెట్ కార్ప్ (ఎన్‌సిసి)కి ఎంపికయ్యారు. కోలారు ఎన్‌సీసీ అధికారుల బృందం శుక్రవారం గ్రామీణ విద్యా సంస్థకు వచ్చి పాఠశాలలో 50 మందికి పైగా ఆసక్తి కలిగిన విద్యార్థులకు వివిధ దశలలో లిఖిత, దైహిక సామర్థ్య పరీక్షలను నిర్వహించారు. అత్యుత్తమ ప్రదర్శన చూపిన 30 మందిని ఎన్‌సీసీకి ఎంపిక చేశారు. సంస్థ కార్యదర్శి ఆము లక్ష్మీనారాయణ, ఎన్‌సీసీ అధికారులు పాల్గొన్నారు.


