అరణ్య వీక్షణం మరింత ప్రియం | - | Sakshi
Sakshi News home page

అరణ్య వీక్షణం మరింత ప్రియం

Jul 27 2026 1:36 AM | Updated on Jul 27 2026 1:36 AM

ఘనంగా ఆషాఢ గణపతి రథోత్సవం
దీనుల కోసం తేజ్‌ బహదూర్‌ బలిదానం

తుమకూరు: శిర తాలూకాలోని బుక్కపట్టణ గ్రామంలో శ్రీ ఉద్భవ గణపతి ఆషాఢ ద్వాదశి మహా రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసంలో ఉద్భవ గణపతి తేరును నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ మాసంలో సొంతూరికి వచ్చిన అమ్మాయిలు, భర్తతో కలిసి రథంపైకి అరటిపండ్లు విసిరితే అదృష్టం కలిసివస్తుందని నమ్ముతారు. వందలాదిగా భక్తులు పాల్గొన్నారు.

గతంలో గంటన్నరగా ఉన్న సఫారీ సమయాన్ని ఇప్పుడు 3 గంటలకు పెంచడం టూరిస్టులకు ఊరట కలిగిస్తుంది. డీజిల్‌ ధరలు పెరిగాయి. గతంలో సఫారీ వాహనం 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించేది. ఇప్పుడు 30 నుంచి 35 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోందని, ఈ కారణాలన్నింటి వల్ల చార్జీల పెంపు అనివార్యమని బందిపుర టైగర్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ నందీష్‌ తెలిపారు.

బండిపుర, నాగరహోళె అడవుల్లో సఫారీ టూర్లు

మైసూరు: ఇకపై మైసూరు, కొడగు, చామరాజనగర తదితర జిల్లాల్లో విస్తరించిన బండిపుర, నాగరహోళె జాతీయ అరణ్యాల్లో సఫారీలో విహరించాలి అనుకుంటే ఎక్కువ డబ్బును చెల్లించాలి. సఫారీ ధరలను అటవీశాఖ విపరీతంగా పెంచేసింది. సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త చార్జీలు అమలులోకి వస్తున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు సఫారీకి వెళ్లడం భారంగా మారుతుందని విమర్శలు వచ్చినా సర్కారు లెక్కచేయలేదు.

ఎక్కడి నుంచి...

సఫారీ రుసుములను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బండిపుర పర్యావరణ పర్యాటక ప్రాంతం (మేలుకమనహళ్లి గేట్‌), సుంకదకట్టే అటవీ ప్రాంతం (కాకనకోట, దమ్మనకట్టే, అంతరసతే కబిని), అలాగే నాగరహోళె పర్యావరణ పర్యాటక ప్రాంతం (నానచ్చి గేట్‌, వీరహోసళ్లి గేట్‌)లలోని సఫారీ వాహనాలకు కొత్త చార్జీలు వర్తిస్తాయి.

పెద్దలకు రూ.వెయ్యి

● బస్‌ సఫారీ టికెట్‌ ధర పెద్దలకు రూ. 650 ఉంటే, ఇప్పుడు రూ. వెయ్యికి, పిల్లల టికెట్‌ రూ.350 ఉంటే, రూ. 500కి పెంచారు.

● జీప్‌ సఫారీ టికెట్‌ను పెద్దలకు రూ. 1,000 నుంచి రూ. 1,500కి, పిల్లలకు రూ. 500 నుంచి రూ.750కి పెంచారు.

● పర్యాటకుల వాహనాల పార్కింగ్‌ ఛార్జీలు, కెమెరా చార్జీలను కూడా పెంచారు.

● మూడేళ్లలోపు పిల్లలకు ప్రవేశ, టికెట్‌ ఫీజులు ఉండవని, కానీ వారు తల్లిదండ్రుల సీటులో కూర్చోవాలని అటవీ అధికారులు తెలిపారు.

దొడ్డబళ్లాపురం: గురు తేజ్‌ బహదూర్‌ బలిదానం, సేవ, కరుణ అందరికీ ఎల్లప్పుడూ ప్రేరణదాయకమని గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ పేర్కొన్నారు. బీదర్‌లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, వివిధ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన గురు తేజ్‌ బహదూర్‌ 350వ వర్ధంతి సందర్భంగా జాతీయ సదస్సును గవర్నర్‌ ప్రారంభించి మాట్లాడారు. ధర్మం, సత్యం, దీనజనుల కోసం ఆయన చేసిన బలిదానం కారణంగానే ఆయనను గౌరవపూర్వకంగా హింద్‌ ది చాదర్‌గా పిలుస్తారన్నారు. ఆయన సందేశాలు నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో సిక్కు మత గురువులు, అధికారులు పాల్గొన్నారు. గురుద్వారాను గవర్నర్‌ను దర్శించి ప్రార్థనలు చేశారు.

టూర్‌ సమయం రెట్టింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement