విలేకరులకు భవనం నిర్మిస్తాం | - | Sakshi
Sakshi News home page

విలేకరులకు భవనం నిర్మిస్తాం

Jul 27 2026 1:36 AM | Updated on Jul 27 2026 1:36 AM

బళ్లారి టౌన్‌: సీఎస్‌ఆర్‌ నిధులతో విలేకరులకు భవనం, సమాచార శాఖకు వాహన సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్‌ పేర్కొన్నారు. ఆదివారం కర్ణాటక వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ భవన్‌లో పత్రికా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాధ్యమ విలేకరుల కుటుంబాలకు ఆరోగ్య చికిత్స, పిల్లలకు విద్య సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పత్రికా అకాడమీ సభ్యుడు కే.నింగజ్జ మాట్లాడుతూ.. పత్రికల్లో ప్రతినిధులకు ఉన్న సదుపాయాలు పార్ట్‌టైమ్‌ విలేకరులకు లేవని తెలిపారు. అనంతరం 10వ తరగతి, పీయూసీ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్‌ సుమన్‌ డీ.పన్నేకర్‌, పాత్రికేయుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్‌.వీరభద్రగౌడ, సమాచార శాఖ ఏడీ బీవీ తుకారాం, సంఘం కచాంచి ఏ.అశోక్‌, రాష్ట్ర కార్యకారి సమితి సభ్యుడు హెచ్‌.బసవరాజ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement