వికటించిన సాహస క్రీడలు | - | Sakshi
Sakshi News home page

వికటించిన సాహస క్రీడలు

Jul 21 2026 12:35 AM | Updated on Jul 21 2026 12:35 AM

దాండేలిలో టూరిస్టుకు తీవ్రగాయాలు

యశవంతపుర: ఉత్తరకన్నడ జిల్లా దాండేలిలో సుందరమైన ప్రకృతిని చూస్తూ, సాహస క్రీడలను ఆడుతూ తాడు తెగి 40 అడుగుల నుంచి కిందపడిన పర్యాటకులు ఆస్పత్రి పాలయ్యాడు. బాధితుడు విజయపుర జిల్లాకు చెందిన కుబేర సురపుర (24). 3న కుబేర, సోదరుడు ప్రశాంత్‌తో కలిసి దాండేలిలో స్పర్లింగ్‌ రివర్‌ రిసార్ట్‌కు వెళ్లారు. అక్కడ తాడు కట్టుకుని గాలిలో ప్రయాణిస్తుండగా సగం దారిలో జిప్‌ లైన్‌ లాక్‌ తెగిపోయింది. దీంతో 40 అడుగులపై నుంచి కుబేర కింద పడ్డాడు. రెండు చేతులు, కాళ్లు విరిగిపోయాయి, ఇంకా అనేక గాయాలు తగిలాయి. ప్రశాంత్‌, మరికొందరు అతన్ని ఆస్పత్రికి తరలించారు. తరువాత మహారాష్ట్రలోని మీరజ్‌ ఆస్పత్రిలో చేర్చారు. అనేక శస్త్రచికిత్సలు చేయాలని వైద్యులు తెలిపారు. రిసార్టు యజమాని ఏమాత్రం సాయం చేయడం లేదని బాధితుడు వాపోయాడు. దాండేలిలో టూరిస్టులకు సాహస క్రీడలు నిర్వహించే సంస్థలు అనేకం పుట్టుకొచ్చాయి. ఎలాంటి లైసెన్సులు, నిపుణులు ఉండరు. దీనివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

యాప్‌తో వలవేసి దోచేస్తారు

నగరంలో ముఠా అరెస్టు

యశవంతపుర: మోసపూరిత యాప్‌ ద్వారా అమ్మాయిని ఆశ చూపి వ్యక్తి నుంచి డబ్బులు దోచుకున్న ముఠాని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు చేతన్‌, మను, శాబు, మంజునాథ, జయకుమార్‌, అరుణ, కీర్తీ, కాంత, సందీప్‌, రాజులను నిర్బంధించారు. వీరందరూ కలిసి ఒక యాప్‌ను తయారు చేసి అందులో అమ్మాయిలు దొరుకుతారని పోస్ట్‌ చేసేవారు. దీనిని నమ్మి చాటింగ్‌ చేసేవారిని ఫలానా ప్రదేశానికి రమ్మని దాడి చేసి దోచుకునేవారు. అదే మాదిరి ఓ వ్యక్తి కేజీ హళ్లి హెచ్‌ఆర్‌బీఆర్‌ లేఔట్‌ వద్దకు వెళ్లగా అతన్ని అపహరించారు. వివిధ ప్రాంతాలలో తిప్పి డబ్బులు, మొబైల్‌, బంగారు చైన్‌ను లాక్కుని వదిలేశారు. ఫిర్యాదు మేరకు ముఠాని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

సకాలంలో పూర్తికావాలి సర్‌

సీఈఓ అన్బుకుమార్‌

బొమ్మనహళ్లి: టర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధించేందుకు, బీఎల్‌ఓలు ప్రతి ఇంటినీ సందర్శించాలని, కాలపరిమితిలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వి.అన్బుకుమార్‌ ఆదేశించారు. సోమవారం బెళగావిలో కలెక్టరేటులో సర్‌పై సమీక్ష జరిపారు. బీఎల్‌ఓలు సవరణ పనిని వేగవంతం చేయాలన్నారు. రాజకీయ పార్టీల సహకారం అవసరం, సమాచారాన్ని పంచుకోవాలన్నారు. దరఖాస్తులను సక్రమంగా నమోదు చేసి, వాటి రికార్డులను క్రమపద్ధతిలో సేకరించాలి, సమస్యలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు జరపాలని ఆదేశించారు. అన్బుకుమార్‌, జిల్లా కలెక్టర్‌ మహమ్మద్‌ రోషన్‌ స్థానిక సర్‌ శిబిరాన్ని పరిశీలించారు.

ఫుట్‌పాత్‌ కబ్జాల నేలమట్టం

బనశంకరి: బెంగళూరు ఉత్తరనగర పాలికే పరిధిలో ఫుట్‌పాత్‌ ఆక్రమణలు తొలగింపు చేపట్టారు. సోమవారం సర్వజ్ఞనగర హెణ్ణూరు– బాగలూరు రోడ్డు నుంచి గుడ్‌ఇయర్‌ స్కూల్‌ వరకు ఫుట్‌పాత్‌పై కట్టిన కబ్జాలను తొలగించారు. యలహంకలోని రైతుసంత నుంచి శివనహళ్లి రోడ్డు వరకు 1.30 కిలోమీటర్లు, దాసరహళ్లిలో కమ్మగొండనహళ్లి మెయిన్‌ రోడ్డు వరకు 1.50 కిలోమీటర్ల మేర తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement