ఓటరు రక్షణకు పౌర ఓటు పర్యవేక్షణ కమిటీ | - | Sakshi
Sakshi News home page

ఓటరు రక్షణకు పౌర ఓటు పర్యవేక్షణ కమిటీ

Jul 17 2026 3:16 AM | Updated on Jul 17 2026 3:16 AM

హొసపేటె: రాష్ట్రంలో ప్రారంభమైన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో నిజమైన ఓటర్లను రక్షించేందుకు పౌర ఓటు పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశామని రాష్ట్ర రైతు సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఓటింగ్‌ గార్డ్‌ కమిటీ కన్వీనర్‌ జేఎం.వీరసంగయ్య తెలిపారు. పత్రికా భవనంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా సవరణలో ఓటరు జాబితా నుంచి అనర్హుల పేర్లను తొలగించే ప్రక్రియ సాగుతోందన్నారు. ఈ నేపథ్యంలో నిజమైన ఓటర్లను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయవాణిని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఓటును కాపాడే పనిని ఓట్‌ వాచ్‌ కమిటీ చేస్తుందని ఆయన అన్నారు. విలేకరుల సమావేశంలో స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు కరియప్ప గుడిమని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement