వేంకట రమణుల రథోత్సవం
● నమామి రేణుకా యల్లమ్మ
బొమ్మనహళ్లి: రామనగర జిల్లాలోని చన్నపట్టణ కెంగల్ తాలూకాలో వెలసిన పురాణ ప్రసిద్ధ ఆంజనేయస్వామి జాతర మహోత్సవం, లక్ష్మీ వెంకటేశ్వరస్వామి రథోత్సవం బుధవారం ఆనందోత్సాహాలతో జరిగాయి. తేరు ఉత్సవాన్ని ఉదయం 11.45 గంటలకు తహశీల్దార్ బి.ఎన్.నగేష్ ప్రారంభించారు. భక్తులు లక్ష్మీ వెంకట రమణా అంటూ తేరును లాగారు. తేరు మీదకు భక్తజనం పండ్లు, బియ్యం విసిరారు. సాయంత్రం పల్లకీ వేడుకలు, భక్తి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలోని సిడి హోసకోటె గ్రామంలో రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయ జాతర మహోత్సవం, దీపోత్సవం కనులపండువగా జరిగాయి. అమ్మవారికి మహిళా భక్తులు పుష్ప హారతులు, జ్యోతులు తీసుకొచ్చి పూజలు చేశారు. సీనియర్ అర్చకుడు హోసకోటే మునిరాజు మాట్లాడుతూ ఆలయానికి ఘన చరిత్ర ఉందని, భక్తుల కష్టాలను అమ్మవారు ఇట్టే తొలగిస్తారని చెప్పారు.
వేంకట రమణుల రథోత్సవం
వేంకట రమణుల రథోత్సవం


