మహిమాన్వితం.. పురాతన ఆలయం
సాక్షి బళ్లారి: కోరిన కోర్కెలు తీర్చే, లక్షలాది మంది భక్తులు ఆరాధించి, పూజించి కొలుస్తున్న రూపనగుడి శ్రీలక్ష్మీవెంకటరమణస్వామి ఆలయం భక్తుల కొంగుబంగారంగా భాసిల్లుతోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో బళ్లారి గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని రూపనగుడి గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీవెంకటరమణస్వామి ఆలయం ఎంతో పురాతనమైనది. 1207 సంవత్సరంలో ఈప్రాంతాన్ని పాలించిన రూపణ్ణ నాయక్ అనే పాలెగాడు ఆధ్వర్యంలో ఛాయాపతి, శామాచార్ అనే బ్రాహ్మణ ఆయుర్వేద వైద్యులు ఎంతో శ్రమించి ఆలయాన్ని నిర్మించారు. వారు నిర్మించడానికి ముందే ఆలయంలో చిన్నగుడిలో చెన్నకేశవ స్వామి, శ్రీఆంజనేయస్వామి విగ్రహాలను ఉంచి భక్తులు ఎన్నో వందల ఏళ్ల నుంచి పూజిస్తూ తమ కోర్కెలను తీర్చుకునేవారు.
17వ తరపు ఆలయ పూజారిగా జనార్థనాచార్యులు
ఆ తర్వాత ఇదే ఆలయ పరిసరాల్లో దాదాపు ఒక ఎకరానికి పైగా విస్తీర్ణంలో తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ తరహాలో ఆలయాన్ని నిర్మించారు. 800 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీలక్ష్మీవెంకటరమణస్వామి ఆలయంలో ఒకే కుటుంబానికి చెందిన వారు పూజారులుగా కొనసాగుతూ ఆలయాన్ని కాపాడుకుంటూ వస్తుండటం విశేషం. ప్రస్తుతం 17వ తరానికి చెందిన జనార్ధనాచార్యులు పూజారిగా కొనసాగుతున్నారు. ఆలయంలో కొంత భాగం దెబ్బతినడంతో బళ్లారికి చెందిన మాజీ బుడా అధ్యక్షుడు నారా ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టారు. నాలుగేళ్ల క్రితం ఆలయంలో వినూత్న తరహాలో గోపురానికి రంగులు, గర్భగుడికి మరమ్మతులతో పాటు మొత్తం ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడంతో ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఆలయం ఆవరణలోకి ప్రవేశించిన వెంటనే ఎత్తైన ధ్వజస్తంభాన్ని, ఆలయంలో శ్రీలక్ష్మీవెంకటరమణ స్వామి విగ్రహం, అమృతవల్లి రూపంలో ప్రతిష్టించిన లక్ష్మీదేవి విగ్రహం, నవగ్రహాల విగ్రహాలు, శ్రీచెన్నకేశవస్వామి, శ్రీఆంజనేయస్వామి విగ్రహాలను దర్శించుకొని భక్తులు తరిస్తున్నారు.
వైకుంఠ ఏకాదశికి అన్ని ఏర్పాట్లు
ఈనెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు, వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ పూజారి జనార్ధనాచార్యులు సాక్షికి తెలిపారు. ఆలయంలో ప్రతి రోజు పూజలు నిర్వహిస్తున్నామన్నారు. వైకుంఠ ఏకాదశి, వైశాఖ శుద్ధపౌర్ణమి రోజున రథోత్సవం, శనివారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలో పురాతనమైన ఆలయాల్లో మొదటిది రూపనగుడిలోని శ్రీక్షేత్ర శ్రీలక్ష్మీ వెంకటరమణ స్వామి దేవాలయం కావడం విశేషం. కాగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలోని సంగం సర్కిల్ సమీపంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, హొసపేటె రోడ్డులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, సత్యనారాయణపేటెలోని శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు.
రూపనగుడిలోని పురాతన లక్ష్మీవెంకట
రమణస్వామి ఆలయ ముఖ ద్వారం
ఆలయ ధ్వజ స్తంభం
రూపనగుడిలోని శ్రీలక్ష్మీవెంకట
రమణ స్వామి దేవాలయం
ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి
భారీ ఎత్తున ఏర్పాట్లు
మహిమాన్వితం.. పురాతన ఆలయం
మహిమాన్వితం.. పురాతన ఆలయం
మహిమాన్వితం.. పురాతన ఆలయం
మహిమాన్వితం.. పురాతన ఆలయం
మహిమాన్వితం.. పురాతన ఆలయం
మహిమాన్వితం.. పురాతన ఆలయం


