తాలూకా అభివృద్ధికి చర్యలు చేపట్టండి
రాయచూరు రూరల్: కొత్త తాలూకా అభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టాలని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు సూచించారు. శనివారం నగరంలోని శాఖ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాన్వి నుంచి నూతనంగా సిరవార తాలూకాను ప్రకటించడంతో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. పట్టణానికి తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ముందు జాగ్రత్త చర్యలు తీససుకొని పైపులైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులకు మహర్దశ కల్పించడానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. క్రీడా మైదానం, అగ్నిమాపక కేంద్రం, గ్రంథాలయం, హాస్టల్ వంటివి ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే హంపయ్య నాయక్, తహసీల్దార్ అశోక్, టీపీ ఈఓ శశిధర్, ఇంజినీర్లు విజయలక్ష్మి, వీరేష్ నాయక్‌లున్నారు.


