ముగిసిన రత్నమ్మవ్వ అంత్యక్రియలు
బళ్లారి టౌన్: తాలూకాలోని కొళగల్లు గ్రామంలో గత రెండు రోజులుగా ఎర్రితాత మఠం ధర్మకర్త, అధ్యక్షురాలు రత్నమ్మవ్వ మృతి చెందడంతో అంత్యక్రియలు చేయడంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే శనివారం ఉదయం ఎర్రితాత మఠం ఆవరణలో కాకుండా మఠం ముందు భాగంలోని స్థలంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో బీజేపీకి చెందిన మాజీ మంత్రి బీ.శ్రీరాములు, మాజీ ఎంపీ సన్నపక్కీరప్ప పాల్గొని ముందుండి జరిపించారు. అంతకు ముందు మఠంలోని రత్నమ్మవ్వ ఇంటి వద్ద ఆమె భౌతికకాయాన్ని ఊరేగింపు ద్వారా భారీగా ప్రజలు తరలివచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సందర్భంగా బందోబస్తులో బళ్లారికి చెందిన పోలీసు బలగాలు కూడా భారీగా మోహరించారు.
ముగిసిన రత్నమ్మవ్వ అంత్యక్రియలు


