నకిలీ నోట్ల చెలామణి.. ఐదుగురి అరెస్ట్
నరేంద్ర ప్రసాద్
హొసపేటె: జాతరకు వచ్చి నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్న ఘటన విజయనగర జిల్లా హరపనహళ్లిలో జరిగింది. హరపనహళ్లి తాలూకాలోని అరసీకెరె దుర్గమ్మ జాతరలో నకిలీ కరెన్సీని చెలామణి చేస్తున్న అరసీకెరెకు చెందిన కే.మహ్మద్ అఖిల్, నరేంద్ర ప్రసాద్, మహమ్మద్ రియాజ్, కూడ్లిగికి చెందిన బి.బాబు, మొళకాల్మూరుకు చెందిన కుమారస్వామితో పాటు మొత్తం ఐదుగురిని అరసీకెరె పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 మొబైల్ ఫోన్లు, రూ.500ల ముఖ విలువ కలిగిన రూ.80 వేల నకిలీ కరెన్సీ నోట్లు, ఒక గూడ్స్ వాహనం, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సంతలో నకిలీ రూ.500 నోట్లను చెలామణి చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి 24 గంటల్లో నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జాహ్నవి తెలిపారు.
నకిలీ నోట్ల చెలామణి.. ఐదుగురి అరెస్ట్
నకిలీ నోట్ల చెలామణి.. ఐదుగురి అరెస్ట్
నకిలీ నోట్ల చెలామణి.. ఐదుగురి అరెస్ట్
నకిలీ నోట్ల చెలామణి.. ఐదుగురి అరెస్ట్


