వైద్యాధికారులపై చర్యలేవీ? | - | Sakshi
Sakshi News home page

వైద్యాధికారులపై చర్యలేవీ?

Dec 25 2025 8:29 AM | Updated on Dec 25 2025 8:29 AM

వైద్య

వైద్యాధికారులపై చర్యలేవీ?

రాయచూరు రూరల్‌: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్‌) వైద్యాధికారులు, డీహెచ్‌ఓలపై చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్త అంబాజీ డిమాండ్‌ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిమ్స్‌ వైద్యాధికారులు, డీహెచ్‌ఓ, కాంట్రాక్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వాహనం డ్రైవర్‌ అబ్దుల్‌ మతిన్‌తో కలిసి శవాలను తరలించడానికి రూ. 5 వేల దాకా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రద్ధాంజలి వాహనం డ్రైవర్‌ అబ్దుల్‌ మతిన్‌ కాంట్రాక్ట్‌ పద్ధతి నాలుగు నెలల క్రితం ముగిసినా అతనిని అలాగే విధుల్లో కొనసాగిస్తున్నారని, అతనిని విధుల నుంచి తొలగించాలన్నారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేశారు.

బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యాకాండకు నిరసన

రాయచూరు రూరల్‌: బంగ్లాదేశ్‌లో హిందువులను హత్య చేయడం తగదని విశ్వ హిందూ పరిషత్‌, భజరంగదళ్‌ తీవ్రంగా ఖండించాయి. బుధవారం అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు రవికృష్ణ మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో గతంలో హిందువులను సామూహికంగా బహిష్కరణ చేయడంతో పాటు నరమేధానికి పాల్పడ్డారన్నారు. యువకుడిని చెట్టుకు కట్టేసి ఉరి వేసి హత్య చేసి ప్రజల ముందు దహనం చేయడం హేయమైన కృత్యమన్నారు. రెండు నిమిషాల పాటు మౌనం వహించి సంతాపం వ్యక్తం చేశారు.

మంత్రాలయంలో నటుడు రిషబ్‌ శెట్టి సందడి

రాయచూరు రూరల్‌ : మంత్రాలయాన్ని బుధవారం కన్నడ సినీ నటుడు రిషబ్‌ శెట్టి సందర్శించారు. రాఘవేంద్ర స్వామి మఠంలో రిషబ్‌ శెట్టి దంపతులు రాఘవేంద్ర స్వామి మూల విరాట్‌కు ఊంజల్‌ సేవ చేశారు. అనంతరం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్‌ వారిద్దరిని సన్మానించారు. కాగా భక్తుల సందడి మధ్య మంత్రాలయంలో గజ వాహన రథోత్సవం నిర్వహించారు.

ఘనంగా రైతు దినోత్సవం

హొసపేటె: నగరంలోని గాంధీ చౌక్‌ సమీపంలో ప్రొఫెసర్‌ నంజుండప్ప వర్గం రైతు దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని రైతులు మండిపడ్డారు. చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని, పంటలకు మద్దతు ధర ప్రకటించాలని తదితర డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశారు. రైతు సంఘం నేత జడియప్ప తదితరులు పాల్గొన్నారు.

జిల్లాధికారి ఆకస్మిక తనిఖీ

రాయచూరు రూరల్‌: జిల్లాధికారి నితీష్‌ రాయచూరులో ఆకిస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరం లోని దత్తు స్వీకార కేంద్రం, బాల, బాలికల మందిరాలు(రిమాండ్‌ హోం), ఆశాదీప మూగ, బధిర పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. సకాలంలో పౌష్టికాహారం, వైద్య సౌకర్యాలకు తోడు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. కుమార్‌, శ్రీదేవి, కిరిలింగప్ప, రమేష్‌ పాల్గొన్నారు.

28న విశ్వ పాత్రికేయుల దినోత్సవం

రాయచూరు రూరల్‌: ఈ నెల 28న ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం ఏర్పాటు చేసినట్లు రిపోర్టర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడు విజయ్‌జాగటకల్‌ పేర్కొన్నారు. స్థానిక పాత్రికేయుల భవనంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, రాయచూరు లోక్‌సభ, శాసనసభ, విధానపరిషత్‌ సభ్యులు, జిల్లా అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, ఎస్పీ పాల్గొంటారని తెలిపారు. రఘునాథరెడ్డికి జీవమాన సాధన అవార్డు, నలుగురికి సామాన్య అవార్డులు అందజేయనున్నారు.

వందేమాతర గీతాలాపన

రాయచూరు రూరల్‌: వందేమాతర గీతానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా బుధవారం దేవదుర్గలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముక్తకంఠంతో వందేమాతర గీతాన్ని పాడారు. ఉప తహసీల్దార్‌ భీమరావ్‌, సిద్ధయ్య స్వామి, బసవరాజ్‌, హంపయ్య, సుభాష్‌ చంద్ర, అమీర్‌, బందే నవాజ్‌, గంగమ్మ, లక్ష్మణ్‌, రాజశేఖర్‌, నరసింగరావ్‌లున్నారు.

వైద్యాధికారులపై చర్యలేవీ?1
1/4

వైద్యాధికారులపై చర్యలేవీ?

వైద్యాధికారులపై చర్యలేవీ?2
2/4

వైద్యాధికారులపై చర్యలేవీ?

వైద్యాధికారులపై చర్యలేవీ?3
3/4

వైద్యాధికారులపై చర్యలేవీ?

వైద్యాధికారులపై చర్యలేవీ?4
4/4

వైద్యాధికారులపై చర్యలేవీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement