లంచగొండి అధికారి మాకొద్దు
పావగడ: ప్రతి పనికి లంచం కావాలని డిమాండ్ చేస్తూ కింది స్థాయి ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తించే స్థానిక తాలూకా పంచాయతీ సమితి ఈఓ బీకే ఉత్తమ కుమార్ ఏమంత ఉత్తముడు కాదని, వెంటనే అతన్ని బదిలీ చేయాలని స్థానిక గ్రామ పంచాయతీల పిడిఓలు, కార్యదర్శులు ఆందోళన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్‌ను కలిసి తమ బాధలను ఏకరువు పెట్టారు. ప్రతి నెలా చెప్పినంత ముడుపులను ఉత్తమకుమార్‌కు అందించాలని, లేకుంటే అభివృద్ధి పనుల్లో తగాదాలు సృష్టించి నోటీసులు అందిస్తానని బెదిరిస్తాడని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకుంటే అభివృద్ధి పనులకు అడ్డుపడతాడని ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు చన్నగిరి లో పనిచేసి, అవినీతి ఆరోపణల శిక్షతో బదిలీ పై పావగడ కు వచ్చాడని తెలిపారు. తక్షణమే అతడిని బదిలీ చేయాలని కోరారు.


