కెంపేగౌడ ఒక్కలిగర సంఘం ఆందోళన..
చింతామణి: పట్టణంలోని అశ్విని లే అవుట్‌లో ఇళ్లు కట్టుకుంటున్న తమను కొందరు బెదిరిస్తున్నారని, విచారించి న్యాయం చేయాలని యజమాని జయరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెంపేగౌడ ఒక్కలిగర సంఘం నాయకులు, తదితరులతో కలిసి జయరామిరెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం ఆందోళన నిర్వహించారు. జయరామిరెడ్డి మాట్లాడుతూ సర్వే నెం:146/1, 146/2, 146/3లో 12 గుంటల భూమిని కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకుంటున్నామని తెలిపారు. లావణ్య, శ్రీరామ నుంచి చట్ట ప్రకారం తాము భూమి కొనుగోలు చేశామన్నారు. అయితే వెంకటగిరికోట ప్రాంతానికి చెందిన వెంకటరమణప్ప, నరసింహ, మునెయ్య చిక్కనరసింహ, శ్రీనివాస్, మరో పదిమందితో వచ్చి భూమిలో ఇల్లు కట్టవద్దంటూ దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని సీఐ విజయకుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రఘునాథరెడ్డి, రాజారెడ్డి, స్కూల్ సుబ్బారెడ్డి, ఊలవాడిబాబు, తదితరులు పాల్గొన్నారు.


