అంత్యక్రియలకు వెళ్లి వస్తూ మృత్యువాత
మండ్య: బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మరణించారు. ఈ ఘటన మద్దూరు తాలూకా యరగనహళ్లి గ్రామంలో జరిగింది. మండ్య తాలూకా కొత్తత్తి హోబళి హుల్కెరె గ్రామానికి చెందిన మంచేగౌడ కుమారుడు శంకర్ (43), జోగయ్య కుమారుడు వీరేంద్ర (46)లు తోరెశెట్టి గ్రామంలో బంధువు అంత్యక్రియలకు హాజరయ్యారు. తిరిగి బైక్‌పై వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. రక్తస్రావంతో ఇద్దరు అక్కడిక్కడే పడి మరణించారు. కేసు దర్యాప్తులో ఉంది.
మృతులు వీరే
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ మృత్యువాత


