ఆటో వీలింగ్.. ఒకరి అరెస్ట్
దొడ్డబళ్లాపురం: ఆటోలో వీలింగ్ చేస్తున్న కేఆర్ పురం నివాసి ఉదయ్ విక్రమ్(28) అనే వ్యక్తిని కేఆర్ పుర ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతను ప్రమాదకంగా ఫీట్లు చేస్తూ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో అతడ్ని గుర్తించి అరెస్టు చేశారు.
అసోం మహిళ అదృశ్యం
శివమొగ్గ: అసోంకు చెందిన మహిళ అదృశ్యమైనట్లు భద్రావతిలోని హళేనగర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. అసోం నివాసి సమీరున్నీసా(28) హొళెహొన్నూరు రోడ్డులోని అమీర్‌జాన్ కాలనీలోని హైదర్ అలీ అనే వ్యక్తి ఔట్‌హౌస్‌లో ఉంటూ పాచి పని చేస్తుండేది. అయితే ఆమె ఈనెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈమె ఆచూకీ తెలిసిన వారు భద్రావతి హళేనగర పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసు శాఖ ఓ ప్రకటనలో కోరింది.
శాంటాక్లాజ్ వేషధారణ
బనశంకరి: సిలికాన్‌సిటీ బెంగళూరులో క్రిస్మస్ సందడి జోరందుకుంది. అంజనానగరలో బ్రిటన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో బుధవారం చిన్నారులు శాంటాక్లాజ్ వేషధారణతో సందడి చేశారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకొని ఆనందంగా గడిపారు.
దర్శన్ భార్యకు
అశ్లీల సందేశాలు
యశవంతపుర: నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మికి అశ్లీల సందేశాలు రావటంతో ఆమె బెంగళూరు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల సుదీప్–దర్శన్ అభిమానుల మధ్య వార్ నడుస్తుంది. అయితే వివాదాలకు తెర పడుతున్న తరుణంలో విజయలక్ష్మికి కొంతమంది అశ్లీల సందేశాలు పంపారు. దీంతో ఆమె బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తన ఖాతాకు వచ్చిన సందేశాలను అందజేశారు. కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేశారు. అశ్లీల సందేశాలు పెట్టేవారికి తగిన గుణపాఠం నేర్పుతానంటూ విజయలక్ష్మి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
డ్రగ్స్ దందా.. నలుగురి అరెస్టు
దొడ్డబళ్లాపురం: డ్రగ్స్ దందాపై దావణగెరెలోని విద్యానగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగరంలోని జేహెచ్ పటేల్ కాలనీలోని పార్క్‌లో గంజాయి విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో దాడి చేశారు. రాజస్థాన్‌కు చెందిన రామ్ స్వరూప్(33), ధోలారామ్(36), దేవ్ కిషన్(35), దావణగెరె తాలూకా శామనూరు గ్రామం నివాసి వేదమూర్తి(53)ని అరెస్ట్ చేశారు. వేదమూర్తి స్థానిక కాంగ్రెస్ నేత కావడం గమనార్హం. నిందితులనుంచి రూ.10 లక్షల విలువైన 90గ్రాముల ఎండీఎం, 200 గ్రాముల ఓపీఎం డ్రగ్స్, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు.
పొలాల్లోనే సేంద్రియ ఎరువు తయారీ
గౌరిబిదనూరు: నగరసభ అందించే పొడి చెత్తతో రైతులు తమ పొలాల్లోనే ఎరువులను తయారు చేసుకోవచ్చని నగరసభ పరిసర ఇంజనీర్ శివశంకర్ తెలిపారు. పొడిచెత్త నిర్వహణపై తాలూకాలోని హోసూరు హోబళీ కదిరేనహళ్లిలో నగరసభ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నగరసభ సేకరించిన చెత్తను పొలాల్లో తవ్విన గుంతల్లో వేస్తారన్నారు. దానిని మట్టితో కప్పి పెడతారన్నారు. మూడు నెలల అనంతరం అది సేంద్రియ ఎరువుగా రూపాంతరం చెందుతుందన్నారు. దీనివల్ల రైతులకు ఎరువుల ఖర్చు పూర్తిగా తగ్గుతుందన్నారు. అధికారులు పొలాల వద్దకు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. హెల్త్ ఇన్‌స్పెక్టర్ నవీన్, సణ్ణమీర్ రైతులు పాల్గొన్నారు.
ఆటో వీలింగ్.. ఒకరి అరెస్ట్
ఆటో వీలింగ్.. ఒకరి అరెస్ట్
ఆటో వీలింగ్.. ఒకరి అరెస్ట్
ఆటో వీలింగ్.. ఒకరి అరెస్ట్


