మంచు కప్పేసి.. మృత్యువు కాటేసి
చలిగాలులతో కూడిన మంచు ప్రమాదకరంగా మారుతోంది. జాతీయ రహదారిపై పొగమంచు కమ్మేయడంతో వాహన ప్రమాదాలు పెరుగుతున్నాయి. గత 23 రోజుల్లో దాదాపు 75 మంది ప్రమాదాలకు గురికాగా 33 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గాయపడిన వారు మరెందరో ఉన్నారు. ఈ ఏడాది అత్యధికంగా మంచు కురుస్తోంది. హైదరాబాద్ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాలు, పెద్ద వాహనాలు అధికంగా రాకపోకలు సాగిస్తున్నాయి. మంచు కప్పేయడంతో డ్రైవర్లు ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేక ప్రమాదాల బారిన పడుతున్నారు.
– చిక్కబళ్లాపురం


