గ్యారెంటీల అమలులో నిర్లక్ష్యం వద్దు
రాయచూరు రూరల్: పేద ప్రజలకు ప్రభుత్వం నుంచి లభించే సౌకర్యాలను కల్పించే పంచ గ్యారెంటీల అమలులో అధికారులు నిర్లక్ష్యం చేయడం సరికాదని రాష్ట్ర పంచ గ్యారెంటీల అమలు సమితి ఉపాధ్యక్షుడు ఎస్.ఆర్.మెహరోజ్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జెడ్పీ జల నిర్మల కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. పేద ప్రజలకు ప్రభుత్వం పంచ గ్యారెంటీల అమలు విషయంలో అందరికీ అందేలా చూడాలన్నారు. అన్న భాగ్య, యువ నిధి, గృహలక్ష్మి, శక్తి, గృహజ్యోతి అమలులో లోపాలు రాకుండా అందరికీ అందేలా అధికారులు శ్రమించాలన్నారు. గృహజ్యోతి నుంచి 3,52,582 మంది, 1,58,435 మంది నిరుద్యోగులు యువనిధి నుంచి లాభం చేకూరిందన్నారు. సమావేశంలో జిల్లాధ్యక్షుడు పామయ్య మురారి, తాలూకా అధ్యక్షుడు పవన్, రజాక్ ఉస్తాద్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, వ్యవసాయ వర్సిటీ వీసీ హన్మంతప్ప, హుడేద్, నవీన్ కుమార్, రోణలున్నారు.


