విద్యార్థుల్లో సానుకూల దృక్పథం అవసరం
హొసపేటె: విద్యార్థులు తమ మనస్సుల నుంచి ప్రతికూల అంశాలను తొలగించి, సానుకూల అంశాలతో నింపుకోవాలని హంపీ కన్నడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ డీవీ.పరమ శివమూర్తి అన్నారు. హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో నుంచి భవనంలో 2025–26వ మొదటి సంవత్సరం విద్యార్థుల స్వాగత వేడుకను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. కన్నడ విశ్వవిద్యాలయంలో అధ్యయనాలకు చాలా బహిరంగ వాతావరణం ఉందని అన్నారు. 5 లక్షలకు పైగా పుస్తకాలతో లైబ్రరీ వ్యవస్థ ఉందన్నారు. విద్యార్థులు తమ చదువులో 100 శాతం కృషి చేయాలి, మీ సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేయాలని అన్నారు. ముఖ్య భాషా నికాయ డీన్ డాక్టర్ మాధవ్ పెరాజె, కన్నడ సాహిత్య అధ్యయన విభాగాధిపతి డాక్టర్ వెంకటగిరి దళవాయి, విద్యార్థులు పాల్గొన్నారు.
మనిషికి మానసిక స్థైర్యం కరాటే
రాయచూరు రూరల్ : మనిషి మానసిక బలానికి, ఆత్మరక్షణకు కరాటే దోహదపడుతుందని కేపీసీఎల్ ఏఈఈ మహేష్ పేర్కొన్నారు. సోమవారం శక్తినగర్ బసవ కళ్యాణ మంటపంలో జిల్లా ఫేం కాక్ సిలాట్ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో జ్యోతి వెలిగించి మాట్లాడారు. దేశఽంలో కరాటేకు ఉన్న ప్రాధాన్యతను వివరించడానికి ఫేం కాక్ సిలాట్ సంస్థ చేస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రకృతి దేహానికి సంబంధించిన క్రీడగా భావించాలన్నారు. ఫేం కాక్ సిలాట్ క్రీడలు ఇండోనేషియా, మలేసియాలో దీనికున్న ప్రాధాన్యతను వివరించారు. ఆత్మరక్షణ, శారీరక మానసిక, సాంస్కృతికతను నేర్పిస్తుందన్నారు. గుండెపోటు నివారణకు మానవుడు ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలన్నారు. సమావేశంలో జిల్లా ఫేం కాక్ సంస్థ సంచాలకురాలు లక్ష్మి, జేసీఐ అధ్యక్షుడు గౌతమ్ కట్టిమని, శరణే గౌడ, సిద్ధప్ప, బసన గౌడ, సవితలున్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా
కాంగ్రెస్ నిరసన
హొసపేటె: నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబాన్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు, మేం ఎల్లప్పుడూ గాంధీ కుటుంబానికి అండగా ఉంటామని కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సిరాజ్‌షేక్ నాయకత్వంలో మంగళవారం చేపట్టిన నిరసనలో పాల్గొని మాట్లాడారు. హొసపేటె అంబేడ్కర్ సర్కిల్‌లో జరిగిన నిరసనలో బీజేపీ రాజకీయాలకు తలొగ్గబోమని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. అదే విధంగా నరేగ పథకం పేరు నుంచి గాంధీజీ పేరు తొలగించారు. బీజేపీకి గాంధీజీ చరిత్ర, పోరాటం తెలియదు. అదనంగా నరేగ పథకం పేరును తొలగించి వీబీజీ రామ్‌జీగా పేరును మార్చారు. దీనిలో 60:40 నిష్పత్తిని చేయడం ద్వారా వారు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏఐసీసీ కార్యదర్శి గోపీనాథ్ పళనియప్పన్, మాజీ మంత్రి పీటీ పరమేశ్వర్ నాయక్, ఎమ్మెల్యే శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకుడు నూర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సానుకూల దృక్పథం అవసరం
విద్యార్థుల్లో సానుకూల దృక్పథం అవసరం


