వేషభాషణ చట్టాన్ని విరమించుకోవాలి
బళ్లారిఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన హిందూ వ్యతిరేక వేషభాషణ చట్టాన్ని విరమించుకోవాలని జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. రాయల్ సర్కిల్‌లో బీజేపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన అనంతరం జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. జిల్లాధ్యక్షుడు అనిల్‌కుమార్ మోకా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ఆసక్తి చూపకుండా ఇలాంటి ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొస్తోందన్నారు. నగరంలో మట్కా, ఇస్పేట్, అక్రమ మద్యం అమ్మకాలు, దొంగతనం, వేశ్యావాటిక, గంజాయి వంటి అమ్మకాలు చేపడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇటీవల మహిళలపై కూడా దౌర్జన్యాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. హిందూ వ్యతిరేక వేషభాషణ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు శ్రీనివాస్ మోత్కర్, కే.హనుమంతప్ప, ధరప్పనాయక్, రామలింగప్ప, మారుతీ ప్రసాద్, గోవిందరాజులు, అరుణ, బాలచంద్ర, గోవింద్, సిద్దేష్, లోకేష్, నాగరాజు, ఆర్.మల్లేశ్, పుష్ప, చంద్రశేఖర్, చాందిని తదితరులు పాల్గొన్నారు.


