మానవతా విలువలు పెంచుకోవాలి
రాయచూరు రూరల్: విద్యార్థులు మానవతా విలువలను పెంచుకోవాలని కిల్లె బృహన్మఠం శాంతమల్ల శివాచార్య స్వామీజీ పేర్కొన్నారు. సోమవారం తాలూకాలోని నెలెహాళ్ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన కళా ఉత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు మొక్కలు పెంచడంతో పాటు ప్లాస్టిక్ నిర్మూలన, స్వచ్ఛతకు శ్రీకారం చుట్టాలన్నారు. క్రమశిక్షణతో ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించాలన్నారు. బీఈఓ ఈరణ్ణ కోసిగి, పాఠశాల ట్రస్టీ మహేశ్వరి, రాఘవేంద్ర, రవి, తిమ్మణ్ణ నాయక్, శ్రీనాథ్‌లున్నారు.
జనవరిలో జిల్లా ఉత్సవాలు
రాయచూరు రూరల్: జిల్లాలో జనవరి 29 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు రాయచూరు జిల్లా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. సోమవారం తన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. దశాబ్దం అనంతరం చేపడుతున్న జిల్లా ఉత్సవాల్లో అందరూ చురుకుగా పాల్గొని విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ దిశగా ఉత్సవాలకు అధికారులు ఇప్పటి నుంచే తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏడీసీ శివానంద, ఏఎస్పీ కుమారస్వామి, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి నరేష్, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, ఈరన్న, సంతోష్ రాణి, సురేష్ వర్మలున్నారు.
చిరుధాన్యాలతో ఆరోగ్య విప్లవం
రాయచూరు రూరల్: దేశంలో చిరుధాన్యాల వినియోగంతో ఆరోగ్య విప్లవం జరుగుతుందని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అన్నారు. సోమవారం వ్యవసాయ వర్సిటీలో సిరిధాన్యాల జాతాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళ్యాణ కర్ణాటకలోని ఏడు జిల్లాల్లో వర్షాధారిత ప్రాంతాల్లో జొన్నలు, కొర్రలు, సజ్జలు, మినుములు, నువ్వులు, రాగులు, గోధుమ పంటలు పండించవచ్చన్నారు. సర్కార్ వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయనుందన్నారు. జాతాలో వైస్ చాన్సలర్ హన్మంతప్ప, అధికారులు ప్రకాష్ చౌహాన్, కృష్ణలున్నారు.
పథకం పేరు మార్పు తగదు
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ(నరేగ) పథకం పేరును మార్చడం తగదని గ్రామీణ కూలీ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో కార్యదర్శి గురురాజ్ మాట్లాడారు. పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చి పేదల కడుపు కొట్టడానికి కుట్ర చేస్తోందన్నారు. నరేగ పథకం పేరును యథాతథంగా కొనసాగించాలన్నారు. ఈ పథకం కింద కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో పనులు చేయించడానికి అనుమతి ఉంటుందని వివరించారు. ఆందోళనలో అజీజ్ జాగీర్దార్, కలమంగి పంపాపతి, హన్మంతరాయ, జగదీష్, మహేష్, జిలాని, హనీఫ్, శ్రీనివాస్‌లున్నారు.
బంగ్లా అక్రమ
వలసదారులతో సమస్య
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడం పోలీసులకు కష్టంగా మారింది. రాష్ట్రంలో కనీసం 485 మంది అక్రమ బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో 308 మందిని బహిష్కరించారు. కొందరు స్థానికులు వలసదారులకు సహకరిస్తుండడంతో వారిని గుర్తించడం సాధ్యం కావడం లేదు. నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసి వలసదారులు ఆధార్ తీసుకుని లోకల్ అని చెప్పుకుంటున్నారు. మరోవైపు చదువులు, టూరిస్టుల పేరుతోభారత్‌లోకి అగుడుపెట్టిన వారు వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోయారు. కేంద్ర హోంశాఖ తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరులో 344, మంగళూరులో 41, బెంగళూరు జిల్లాలో 49, తుమకూరులో 1,కోలారులో 12, హాసన్‌లో 3, కొడగులో 1, చిత్రదుర్గలో 6, ధారవాడలో 2, శివమొగ్గలో 12, ఉడుపిలో 10, ఉత్తరకన్నడలో 4 మంది అక్రమ వలసదారులను గుర్తించారు. కొందరు నేరాలకూ పాల్పడుతున్నారు. రాష్ట్రంలో 157 మంది అక్రమ వలసదారులపై మొత్తం 37 నేరాల కేసులు నమోదయ్యాయి.
మానవతా విలువలు పెంచుకోవాలి
మానవతా విలువలు పెంచుకోవాలి
మానవతా విలువలు పెంచుకోవాలి


