బిహార్ సీఎం రాజీనామాకు డిమాండ్
రాయచూరు రూరల్: ముస్లిం మహిళలను అవమానపరిచిన బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయాలని వక్ఫ్ ప్రొటెక్షన్ ఫోరం డిమాండ్ చేసింది. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు సయ్యద్ మహ్మద్ మాట్లాడుతూ ప్రజలు ఏర్పాటు చేసిన సమావేశంలో ముస్లిం మహిళ ధరించిన బురఖాను అక్కడి సీఎం తీసి చూడటం రాజ్యాంగ బద్ధంగా మైనార్టీ ధర్మానికి వ్యతిరేకమన్నారు. హిజాబ్‌ను తీసి చూసిన ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో తౌసిఫ్, అక్బర్ హుసేన్, ఫర్జానా, మాసూమ్, తయ్యబా, జానీ, షఫీ, జాఫర్‌లున్నారు.
హిజాబ్ ఘటన మత వ్యతిరేకం
మైనార్టీ మహిళ హిజాబ్‌ను తొలగించి చూసిన ఘటనకు నైతిక బాధ్యత వహించి బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయాలని ఏఐఎంఐఎం డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళననుద్దేశించి అధ్యక్షుడు ఫారూక్ షేక్ మాట్లాడారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ సామాన్యులు సంచరించే ప్రదేశంలో నిండు సమావేశంలో మైనార్టీ మహిళ వేసుకున్న బురఖాను తీసి చూడటం ముస్లిం మతానికి వ్యతిరేకమన్నారు. హిజాబ్‌ను తొలగించిన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో ఖాజావలి, హాజీ, అఫ్తాబ్ హుసేన్, తన్వీర్, అల్తాఫ్, రహీం, అజీజ్, రఫీ, జలాల్‌లున్నారు.
బిహార్ సీఎం రాజీనామాకు డిమాండ్


