రైల్వే డిమాండ్లు పరిష్కరించండి
హొసపేటె: హొసపేటె–కొట్టూరు–దావణగెరె మీదుగా మంగళూరుకు నేరుగా రైలు ప్రారంభిస్తే, ప్రపంచ వారసత్వ ప్రదేశాల మధ్య కనెక్టివిటీని అందిస్తుందని రైల్వే అభివృద్ధి సంఘం నేత యమునేష్ తెలిపారు. సోమవారం నగరంలో ఎంపీ ఈ.తుకారాంకు వినతి పత్రాన్ని అందజేశారు. హొసపేటె– షోలాపూర్ మధ్య ప్రస్తుతం నడుస్తున్న రైలును పండర్‌పూర్ వరకు పొడిగించాలన్నారు. తద్వారా పాండురంగ విఠల భక్తులకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. హొసపేటె రైల్వే స్టేషన్ ఆధునీకరణ, పిట్ లైన్ నిర్మాణం, 2 కొత్త ఫ్లాట్‌ఫాంల నిర్మాణం చేపట్టి దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు అనుకూలంగా స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా విజయనగర రైల్వే యూజర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో బళ్లారి లోక్‌సభ సభ్యుడు ఈ.తుకారాంను కలిసి బెళగావి– హొసపేటె–రాయచూరు –హైదరాబాద్– మణుగూరు రైలు పునః ప్రారంభం గురించితో పాటు రైల్వే డిమాండ్లపై పిటిషన్ సమర్పించారు. విజయనగర రైలు వినియోగదారుల సంఘం అధ్యక్షుడు వై.యమునేష్, కార్యదర్శి మహేష్ కుడితిని, నాయకులు దీపక్ ఉల్లి, జీర కల్లేశ్, ప్రభాకర్, ఎం.శంకరప్ప, కేవీ.రమాలి, ఆర్.రమేష్‌గౌడ, నజీర్‌సాబ్, శ్రవణ్‌కుమార్ జే.వరుణ్, మనోహర్, కృష్ణమూర్తిరావు, నాగరాజరావు, అరుణ్‌కుమార్, శ్రీనివాస్ రావు, అమర్ నాథ్ కటరే, హరిశంకర్ రావు తదితరులున్నారు.


