చెరువు సంరక్షణకు చర్యలు
రాయచూరురూరల్: పురాతన కాలం నాటి చెరువుల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజ్ తెలిపారు. నగరంలోని నీరుబావి కుంట చెరువు సంరక్షణ పనులకు ఆయన ఆదివారం భూమిపూజ చేసి మాట్లాడారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పైపులైన్లు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల చెరువులకు నీరందించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాపారెడ్డి, ఎంపీ కుమారనాయక్, శాంతప్ప, తాయన్న నాయక్, జయన్న, శాలం, తదితరులు పాల్గొన్నారు.
శివానుభవ గోష్ఠి
రాయచూరు రూరల్: శరణుల పరంపర, సంస్కతి మానవ మనుగడకు అవసరమని లింగ సూగురు ఆశ్రమవాసులు వరదానేశ్వర స్వామిజీ పిలుపునిచ్చారు. స్థానిక మారుతీనగర్‌లోని గిరి అభయాంజనేయ స్వామి అలయంలో ఆదివారం శరణుల చింతన శివానుభవ గోష్టిని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 12వ శతాబ్దంలో ఆశ్రమ వాసులు వేసిన బాటలో పయనిస్తే ఎవరికీ ఎలాంటి ఆపదలు రావన్నారు. నేడు కులం, మతం పేరుతో మానవుడి జీవితం దుర్భరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరి, బసవరాజ్, లక్ష్మణ్, అయ్యన్న, శ్రీనివాస్, అశోక్, మహదేవప్ప, భీమన్న, చంద్ర శేఖర్, గిరియప్ప, అరుణ, కురుబర్, తదితరులు పాల్గొన్నారు.
అప్పుల బాధతో రైతు అత్మహత్య
రాయచూరు రూరల్: వ్యవసాయ కోసం తెచ్చిన అప్పుల తీరకపోవడంతో ఓ రైతు అత్మహత్య చేసుకున్న సంఘటన యాదగిరి జిల్లాలో జరిగింది. వివరాలు ఇవీ.. యాదగిరి జిల్లా వడగేర తాలుకహల గేరలో ఎల్లప్ప(55) తన మూడు ఎకరాల భూమిలో పంటలు సాగు చేశారు. అతివృష్టితో పంట దిగుబడులు రాక నష్టపోయారు. అయితే సాగుకోసం తెచ్చిన రూ.5 లక్షల అప్పులు తీర్చలేక మానసికంగా కుంగిపోయాడు. శనివారం సాయంత్రం పొలంలోనే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వడగేర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దాసులకు నిలయం.. రాయచూరు క్షేత్రం
రాయచూరు రూరల్: దాసులు పుట్టిన నిలయం రాయచూరు క్షేత్రం అని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజ్ వెల్లడించారు. నగరంలోని జోడు వీరాంజనేయస్వామి ఆలయంలో బన్నెంజె గోవిందాచార్యుల 90వ నమన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బన్నెంజె గోవిందాచార్యులు విద్యా వాచస్పతి అని, సంస్క్రతం, కన్నడ సాహిత్యానికి దిగ్గజుడు అని పేర్కొన్నారు. . ఈ కార్యక్రమంలో ఎంపీ కుమారనాయక్, రోహిత్‌చక్రవర్తి, విజయ సింహాచారి, రమేష్, వీణ, వెంకటేష్, త్రివిక్రంజోషి, నరసింగరావు, కవిత, దానప్ప, వీరహనుమాన్ విష్ణుతీర్థ, అరవింద్, తదితరులు పాల్గొన్నారు.
సంస్కృతికి ప్రతీక పొరుగు సంబరం
రాయచూరురూరల్: సంస్కృతిక ప్రతీకగా నిలిచిన పొరుగు సంబరాలను యాదగిరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే తమ ఎద్దుల బళ్లను చెరకు గడలు, పూలతో అలంకరించారు. వాటిపై ఊరేగింపుగా పొలానికి చేరుకుని భూ మాతకు పూజలు చేశారు. యడ్రామి, రామసముద్రం, అబ్బెతుంకురులో పొలాల్లోనే రైతు కుటుంబీకులు సామూహిక భోజనాలు చేశారు. ఈ సందర్భంగా గిరిజనుల సంప్రదాయ నృత్యం ఆకట్టుకుంది.
నియామకం
కోలారు: కర్ణాటక జ్ఞాన విజ్ఞాన సమితి కోలారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా వై.మంజుళ నియమితులయ్యారు. సమితి జిల్లా అధ్యక్షుడు జి శ్రీనివాస్ మాట్లాడుతూ సమితి కార్యక్రమాలకు ఆమె నాయకత్వం అందించాలన్నారు. జగన్నాథ్, పద్మావతి పాల్గొన్నారు.
చెరువు సంరక్షణకు చర్యలు
చెరువు సంరక్షణకు చర్యలు
చెరువు సంరక్షణకు చర్యలు


