చిన్నారులకు పోలియో చుక్కలు
సాక్షి బళ్లారి: 0–5 ఏళ్ల చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ప్రముఖులు పేర్కొన్నారు. నగర మేయర్ గాదెప్ప, లిడ్‌కర్ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజు, డీఎంహెచ్‌ఓ రమేష్‌బాబు, తదితరులు ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులు మాట్లాడుతూ జిల్లాలో 920 బూత్‌లలో 49 బృందాలు, రెండు వేల మంది సిబ్బంది. 1000 మంది ఇతర సభ్యులు చురుకుగా పాల్గొని పోలియో చుక్కలు వేశారన్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ కార్యక్రమం కొనసాగిందని తెలిపారు.
బళ్లారిటౌన్: పిల్లల అంగ వైకల్యాన్ని నియంత్రించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని డాక్టర్.బాబుజగ్జీవన్ రామ్ చర్మ పారిశ్రామిక నిగమ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజ్ పేర్కొన్నారు. బళ్లారి జిల్లా ఆస్పత్రి ఆవరణలో ఆదివారం జిల్లా స్థాయి పల్స్ పోలియో చుక్కల వేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ వ్యాప్తంగా గత పదేళ్లుగా పల్స్ పోలియో చురుగా సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ పి.గాదెప్ప, గ్యారెంటీ పథకాల ప్రాధికార అధ్యక్షుడు చిదానందప్ప, జెడ్పీ సీఎస్ మహమ్మద్ హ్యరీస్, అధికారులు రమేష్‌బాబు, ఏడీసీ మహమ్మద్ ఝుబేర, బసిరెడ్డి, హనుమంతప్ప, ఖుర్కిద్ బేగం తదితరులు పాల్గొన్నార
బళ్లారి అర్బన్: జిల్లాలో పల్స్ పోలియో విజయవంతమైంది. జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆవరణలో నమ్మ క్లినిక్ తరఫున ఏర్పాటుచేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు అవార్ మంజునాథ్, గౌరవ కార్యదర్శి సురేష్‌బాబు ప్రారంభించారు. సదరు ఆస్పత్రి ఛైర్మన్ సురేంద్రకుమార్, వైద్యాధికారులు డాక్టర్.అభిషేక్ పాల్గొన్నారు.
రాయచూరురూరల్: రాయచూరు జిల్లాలో నాలుగు రోజులపాటు పల్స్ పోలియో చుక్కలు వేయాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజ్ కోరారు. స్థానిక నిజలింగప్ప కాలనీలోని కేఈబీ పాఠశాలలో ఆదివారం ఓ చిన్నారికి పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 1132 కేంద్రాలల్లో 2,59,984 మంది పిల్లలకు చుక్కలమందు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి నితీష్, సురేంద్రబాబు, నందిత, విజయ్‌శంకర్, ప్రవీణ్‌కుమార్, హారతి, శివమానప్ప, అనిల్, గణేశ్, శివ కుమార్, షాకీర్, ఈశ్వర్, బసయ్య, తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులకు పోలియో చుక్కలు
చిన్నారులకు పోలియో చుక్కలు


