పోలియో నిర్మూలనకు కట్టుబడి ఉందాం
● ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
హొసపేటె: మానవాళికి శాపంగా మారిన పోలియో వైరస్ నిర్మూలనకు అధికారులంతా కట్టుబడి ఉండాలని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. కమలాపూర్ సమీపంలోని హంపీ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాంగణంలో చింతపండు, సీతాఫలం, లక్షణ పండ్లతో సహా వివిధ జాతుల మొక్కలను నాటి నీరు పోశారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో పిల్లలకు టీకాలు వేశారు. మంత్రి మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రాధాన్యం, వైభవం.. సంపన్న భారతదేశాన్ని నిర్మించాలనే సందేశం తీసుకువెళ్తాయన్నారు. విజయనగరాన్ని స్ఫూర్తిగా తీసుకొని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతామన్నారు. అనంతరం హవామా కార్యాలయ ప్రాంగణంలో ఆమె చింత చెట్టు నాటి నీరు పోశారు. ఎంపీ ఇ.తుకారాం, ఎమ్మెల్యేలు హెచ్‌ఆర్.గవియప్ప, డాక్టర్.ఎన్‌టి.శ్రీనివాస్ పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ వ్యవహరాలు, రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా, నాగరాజు మద్దిరాల, రవిఅగర్వాల్, అనురాధ ఠాకూర్, అనిరుద్ధ శ్రవణ్. కే.మోసెస్‌చలై, దీప్తిగౌర్ ముఖర్జీ, కలెక్టర్ కవితా ఎస్.మన్నికేరి, తదితరులు పాల్గొన్నారు.
హంపీలో నిర్మలా సీతారామన్
హొసపేటె: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం రాత్రి హంపీలోని ఎలిఫెంట్ హౌస్ వద్ద ఏర్పాటుచేసిన లేజర్ షో(ధ్వని, కాంతి)ను వీక్షించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో హంపీకి చేరుకున్న ఆమె గత వైభవాన్ని గుర్తుచేసేలా నిర్వహించిన లేజర్‌షోను ఆసక్తిగా తిలకించారు. విజయనగర సామ్రాజ్యం వైభవం, శ్రీకృష్ణ దేవరాయ పాలనను ప్రతిబింబించేలా దేశ సంస్కృతి, వారసత్వాన్ని ప్రదర్శించి అందరినీ అలరింపజేశారు. శనివారం రాత్రి హంపీ అనిలే సమీపంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
పోలియో నిర్మూలనకు కట్టుబడి ఉందాం


