ప్రజల సహకారంతో స్వచ్ఛ నగరం
కోలారు: కోలారు నగరాన్ని సుందర స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడానికి ప్రజల సహకారం అవసరమని కలెక్టర్ ఎంఆర్.రవి అన్నారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయ సభాంగణంలో పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చారిత్రక ఇతిహాసం కలిగిన కోలారు నగరంలో నేటికీ రహదారులు, పాదచారి మార్గాలు, శౌచాలయం, ట్రాఫిక్ నియంత్రణ, సూచన పలకాల కొరతతో నిత్యం ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితి మార్చడానికి జిల్లా యంత్రాంగం ప్రయతిస్తోందని, పిల్లలు సురక్షితంగా తిరిగే రోడ్లు, సీనియర్లకు విశ్రాంతినిచ్చే పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ మంగళ, కమిషనర్ నవీన్‌చంద్ర పాల్గొన్నారు.


