అంధ విద్యార్థులకు చట్టాలపై అవగాహన
రాయచూరురూరల్: న్యాయ సేవలపై అవగాహన పెంచుకొని విద్యార్థులు అవసరమైనపుడు సద్వినియోగం చేసుకోవాలని రాయచూరు తాలుకా విద్యా శాఖ అధికారి ఈరణ్ణ కోస్గి పిలుపునిచ్చారు. నగరంలోని మాణిక్ ప్రభు అంధ విద్యార్థుల పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఈరణ్ణ కోస్గి మాట్లాడారు. ప్రతి నాగరికుడు మానవ హక్కులు, చట్టం వివరాలు తెలుసుకోవాలన్నారు. అపుడే ఉచిత న్యాయ సలహాలు పొందడానికి వీలుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివకుమార్, వెంకటేష్, సుదర్శన్, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
పొరుగు ఉత్సవాల సంబరం
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల పొలాల్లో పొరుగు ఉత్సవాల సంబరాలు జోరుగా సాగుతున్నాయి. పొలంలో భూ మాతకు రైతులు పూజలు జరిపి సామూహిక భోజనాలు చేశారు. ఉడంగల్‌లో నువ్వుల అమవాస్యగా పిలవబడే ఈ పండగను రైతులు ఘనంగా జరుపుకున్నారు.
కార్మికుల వేతనాల్లో కోత తగదు
రాయచూరురూరల్: జిల్లా అరోగ్య, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాల్లో కోత విధించడం తగదని రాజ్ కుమార్ అభిమానుల సంఘం డిమాండ్ చేిసింది. పాత్రికేయుల భవనంలో విలేకరులతో సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ మైసూరు షార్ఫ్‌వాచ్ ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ సంస్థ ఆధ్వర్యంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు జూన్ నుంచి వేతనాలు ఇవ్వలేదన్నారు. నెలవారీ రూ.3 వేలు కోత విధించడమేగాక, వారికి పీఎఫ్, ఈపిఎఫ్, జీపీఎఫ్ చెల్లించకుండా నిధులు కాజేశారని ఆయన అరోపించారు.
భూ బాధిత రైతుల దీక్షకు బాసట
బళ్లారి అర్బన్: భూ బాధితుల రైతులకు సీఐడీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే.సత్తిబాబు మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి దారీ విధానాలతో కార్మికుల గొంతును నొక్కేస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులు పిడికిలి బిగించి ఒక్కతాటిపైకి వచ్చినపుడే న్యాయం జరుగుతుందన్నారు. జంగ్లి సాబ్, తిప్పేస్వామి, ఓలిగి సిద్దప్ప, శ్రీధర, తులసమ్మ, దేవమ్మ, హులిగమ్మ, ఈరమ్మ, తిమ్మప్ప, గోపాల, రుద్రప్ప, తదితరులు పాల్గొన్నారు.
వ్యాపారి హత్య
రాయచూరు రూరల్: వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన నగరంలో చోటుచేసుకుంది. కడపకు చెందిన సయ్యద్ హుసేన్‌్ పాషా(25) 15 రోజుల కిందట నగరానికి వచ్చి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం గడుపుతున్నారు. గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో రాయచూరు ఆకాశవాణి కార్యాలయం వద్ద పాషా తన వ్యానులో నిద్రిస్తున్నారు. ఈ సమయంలో దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని ఎస్పీ పుట్టమాదయ్య, యస్.మంజునాథ్, బసవరాజ్ పరిశీలించారు.
అంధ విద్యార్థులకు చట్టాలపై అవగాహన
అంధ విద్యార్థులకు చట్టాలపై అవగాహన
అంధ విద్యార్థులకు చట్టాలపై అవగాహన
అంధ విద్యార్థులకు చట్టాలపై అవగాహన
అంధ విద్యార్థులకు చట్టాలపై అవగాహన


