ఐవీఎఫ్ కేంద్రం ఏర్పాటుకు పచ్చజెండా
హుబ్లీ: కేఎంసీ పరిశోధన ఆస్పత్రి ఆవరణలో తొలిసారిగా కృత్రిమ గర్భధారణ కేంద్రం(ఐవీఎఫ్) ప్రారంభం కానుంది. ఈ ఆస్పత్రిలో ఇప్పటికే సీ్త్ర రోగాలు, కాన్పుల విభాగం పనులు పూర్తవడంతో ఐవీఎఫ్ కేంద్రం ప్రారంభిస్తున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్. డాక్టర్ ఈశ్వరహొసమని తెలిపారు. 2021–22లో ఈ మేరకు ప్రతిపాదనలు పంపగా వివిధ వర్గాల నుంచి ఆర్థిక వనరులు సేకరించి ఐవీఎఫ్ కేంద్రంలో వైద్య పరికరాలు సిద్ధం చేశామన్నారు. ఏ దశలో పరీక్షలు జరపాలి, ఔషధాల పంపిణీ ఎలా ఉండాలనేది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఒక్కో మహిళకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు వస్తుందని ఆయన తెలిపారు. పేద రోగులకు బీపీటీ తరహాలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. లోపాలు అధిగమించి మార్గదర్శకాలను రూపొందిస్తామని, ఎంతమేర సర్వీస్ ఛార్జి విధించాలో ప్రకటిస్తామని తెలిపారు. సీసీసీ తరహాలో పిల్లలు లేని మహిళలకు అనుకూలంగా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తామన్నారు.


