కార్యాలయాల్లో స్వచ్ఛ భారత్‌ | - | Sakshi
Sakshi News home page

కార్యాలయాల్లో స్వచ్ఛ భారత్‌

Dec 21 2025 9:35 AM | Updated on Dec 21 2025 9:35 AM

కార్య

కార్యాలయాల్లో స్వచ్ఛ భారత్‌

రాయచూరు రూరల్‌: జిల్లా పంచాయతీ కార్యాలయం వద్ద వివిధ ప్రభుత్వ ఽశాఖల కార్యాలయాల అధికారులు పరిసరాలను శుభ్రపరిచారు. శనివారం జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌ ఆదేశాల మేరకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. నెలలో మొదటి, మూడవ శనివారం కార్యాలయాలను, పరిసరాలను, రికార్డులను శుభ్రపరచాలని ఆదేశించడంతో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఆ దిశగా పని చేశారు.

బస్సులను ఆపాలని వినతి

రాయచూరు రూరల్‌: నగర, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అనుకూలంగా ఆర్టీసీ బస్సులను పలు చోట్ల ఆపాలని అఖండ కర్ణాటక రక్షణ సమితి డిమాండ్‌ చేసింది. శనివారం సింధనూరు ఆర్టీసీ డిపో వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రాజశేఖర్‌ మాట్లాడుతూ సింధనూరు తాలూకా హంచినాళ క్యాంప్‌ వద్ద 15 గ్రామాల ప్రజలు, విద్యార్థులు ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. గంగావతి, కొప్పళ, సింధనూరు, మస్కి, రాయచూరు ఆర్టీసీ బస్‌ డిపో మేనేజర్లకు లేఖలు రాసి హంచినాళ క్యాంప్‌ వద్ద ఆర్టీసీ బస్సులను నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో స్వాతి, విశ్వనాథ్‌, పార్వతి, ప్రభుస్వామి, ముదుకప్ప, అమరేగౌడ, శేఖరప్ప, శరణప్ప, సుభాష్‌లున్నారు.

కేఎస్‌ఆర్‌పీ బెటాలియన్‌ ఏర్పాటు చేయండి

రాయచూరు రూరల్‌: రాయచూరులో 13వ కేఎస్‌ఆర్‌పీ బెటాలియన్‌ కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జేడీఎస్‌ గ్రామీణ అధ్యక్షుడు నరసింహ నాయక్‌ పేర్కొన్నారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కలబుర్గిలోని కర్ణాటక రిజర్వ్‌డ్‌ పోలీస్‌ బెటాలియన్‌ కేంద్రాన్ని మహిళా రిజర్వ్‌డ్‌ పోలీస్‌ బెటాలియన్‌ కేంద్రంగా మార్చారన్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాలుగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో 12 చోట్ల కేఎస్‌ఆర్‌పీ బెటాలియన్‌ కేంద్రాలున్నాయన్నారు. మునిరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న బెటాలియన్‌ తిరిగి కలబుర్గికి వాపస్‌ రావాలంటూ ఆదేశాలు జారీ చేశారన్నారు. బందోబస్తు సమయంలో మరింత కఠినం అవుతుందన్నారు.

నైతిక విలువలు పతనం

రాయచూరు రూరల్‌: సమాజంలో నైతిక విలువలు నశిస్తున్నాయని సీనియర్‌ కవి బరగూరు రామచంద్రప్ప విచారం వ్యక్తం చేశారు. శనివారం నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో 11వ అఖిల భారత దళిత సాహిత్య సమ్మేళనాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. సందర్భానుసారంగా నైతిక విలువల గురించి ప్రజలకు వివరించాలన్నారు. అఖిల భారత దళిత సాహిత్య సమ్మేళన అధ్యక్షురాలు యశోద మాట్లాడుతూ అంబేడ్కర్‌ వేిసిన బాటలో నడిచి నిజమైన వారసులుగా నిలవాలన్నారు. లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్‌, అర్జున్‌, శాంతప్ప, నరసమ్మ, కృష్ణ, జయన్న, తాయరాజ్‌లున్నారు.

వృద్ధులకు దుస్తుల పంపిణీ

రాయచూరు రూరల్‌: క్రిస్మస్‌ను పురస్కరించుకొని పేద వృద్ధులకు ఉచితంగా దుస్తులను పంపిణీ చేశారు. గురువారం సాయంత్రం రాయచూరు తాలూకా గిల్లేసూగూరు క్యాంప్‌లో సమాధాన సువార్త ప్రార్థన సంఘం ఆధ్వర్యంలో రెవరెండ్‌ పరిశుద్ధరావ్‌ అనాథ పిల్లలకు, వృద్ధులకు నూతన వస్త్రాలను అందించి భగవంతుడి కృపకు పాత్రులు కావాలన్నారు. దేవుడు అందరినీ ఆదరించడానికి మానవతా దృక్పథంతో సేవ చేయాలన్నారు.

కార్యాలయాల్లో స్వచ్ఛ భారత్‌1
1/4

కార్యాలయాల్లో స్వచ్ఛ భారత్‌

కార్యాలయాల్లో స్వచ్ఛ భారత్‌2
2/4

కార్యాలయాల్లో స్వచ్ఛ భారత్‌

కార్యాలయాల్లో స్వచ్ఛ భారత్‌3
3/4

కార్యాలయాల్లో స్వచ్ఛ భారత్‌

కార్యాలయాల్లో స్వచ్ఛ భారత్‌4
4/4

కార్యాలయాల్లో స్వచ్ఛ భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement