అబ్బురం.. ముళ్ల కంపలపై శయనం
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో వివిధ రకాలైన పండుగలను ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఒళ్లు గగుర్పొడిచేలా ముుళ్ల పందిరిపై శయనించే జాతర కొప్పళ జిల్లాలో జరిగింది. అచంచల భక్తివిశ్వాసాలతో ముళ్ల కంప చెట్ల కొమ్మలపై శరీరంపై గాయాలైన వారు వెల్లికిలా పడుకున్నా ఏమీ కాదు. కొప్పళ తాలూకాలోని పలు గ్రామాల్లో ముళ్లకంప చెట్ల శయన ఉత్సవాలను ఆచరిస్తారు. కార్తీక అమావాస్య నుంచి 41 రోజుల పాటు పూజలు జరిపి చట్టి అమవాస్య నాడు మారుతేశ్వర ఆలయంలో యువకులు ఉదయం చెప్పులు వేసుకోకుండా ముళ్ల కంప చెట్లను నరికి తీసుకొచ్చి కుప్పలుగా పోస్తారు. మిద్దెల మీద నుంచి శయనంగా చేసిన ముళ్ల కంప చెట్ల కుప్పలపైకి దూకుతారు. అందులో పడిన యువకులకు గాయాలు కాకుండా ఉంటాయనేది భక్తితో కూడిన విశ్వాసం. ముళ్లకంప చెట్లను రాయితో కత్తిరించి తీసుకొస్తారు. ఎలాంటి ఇనుముతో కూడిన వస్తువులను వినియోగించరాదని గ్రామస్తులు వెల్లడించారు. ముళ్లకంప చెట్లకొమ్మల రాశులపై దూకిన యువకులు రక్త గాయాలతో ఇంటికెళ్లి రాత్రి పూట నల్ల కంబళిపై పడుకుంటే అది నయమవుతుందనే విశ్వాసం వారిలో ఉంది. రెండు, మూడు రోజుల్లో గాయాలు వాటంతటవే మానిపోతాయని చెబుతున్నారు. ముళ్ల కంప చెట్ల రాశుల మీద పడితే తాము కోరుకున్న కోరికలు నెరవేరతాయని వారు వెల్లడించారు.
ఒళ్లు గగుర్పొడిచేలా భక్తుల విన్యాసం
కొప్పళ జిల్లాలోని పల్లెల్లో వింత ఆచారం
అబ్బురం.. ముళ్ల కంపలపై శయనం
అబ్బురం.. ముళ్ల కంపలపై శయనం
అబ్బురం.. ముళ్ల కంపలపై శయనం


