బొగ్గు చౌర్యం ఇంటి దొంగల పనే
రాయచూరు రూరల్: రాష్ట్రానికి 60 శాతం విద్యుత్‌ను అందించే రాయచూరు తాలూకా ఆర్టీపీఎస్ నుంచి విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే బొగ్గును అక్రమంగా నిల్వ ఉంచిన అధికారులు, కాంట్రాక్టర్లు భాగస్వాములు కావడం శోచనీయం. రైల్వే శాఖ, సీఐఎస్‌ఎఫ్ అధికారుల నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణమని బీజేపీ ఆరోపించింది. మూడేళ్ల నుంచి అక్రమంగా సింగరేణి బొగ్గు గనుల నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా రాయచూరు రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేకంగా విద్యుత్ ఉత్పత్తి యూనిట్లకు ఏర్పాటు చేసిన రైల్వే లైన్లపై యద్లాపూర్‌కు సరఫరా చేసేవారు. యరమరస్ నుంచి యూనిట్‌కు మధ్య ఐదు కి.మీ.దూరం ఉంది. మధ్యలో రైలు వ్యాగన్లను నిలిపి నాణ్యతతో కూడిన 120 మెట్రిక్ టన్నుల బొగ్గు విలువ రూ.5 కోట్లు కాంట్రాక్టర్, అధికారులపై దొంగతనం చేసినట్లు తేలింది. ఆర్టీపీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కాంట్రాక్టర్, యద్లాపూర్ రైల్వేస్టేషన్ మాస్టర్‌లను నిందితులుగా గుర్తించారు. నాణ్యతతో కూడిన బొగ్గును దొంగిలించారు. ఈ బొగ్గు నడిచే రైలు నుంచిి కిందపడింది కాదని నివేదికల్లో పేర్కొన్నారు. గత మూడేళ్ల నుంచి ఈ బొగ్గును దొంగలిస్తున్నట్లు సమాచారం సేకరించారు.
అధికారులు, కాంట్రాక్టర్లు కూడా భాగస్వాములు
తోడైన రైల్వే శాఖ, సీఐఎస్‌ఎఫ్ అధికారుల నిర్లక్ష్యం
బొగ్గు చౌర్యం ఇంటి దొంగల పనే


