బతికి ఉన్న వ్యక్తికి డెత్‌ సర్టిఫికెట్‌ జారీ | - | Sakshi
Sakshi News home page

బతికి ఉన్న వ్యక్తికి డెత్‌ సర్టిఫికెట్‌ జారీ

Dec 21 2025 9:35 AM | Updated on Dec 21 2025 9:35 AM

బతికి ఉన్న వ్యక్తికి డెత్‌ సర్టిఫికెట్‌ జారీ

బతికి ఉన్న వ్యక్తికి డెత్‌ సర్టిఫికెట్‌ జారీ

హొసపేటె: గదగ్‌ జిల్లాలోని లక్ష్మేశ్వర్‌ పట్టణ పంచాయతీలో తన సోదరుడి సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి మరణ ధృవీకరణ పత్రం అందించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గదగ్‌ జిల్లాలోని లక్ష్మేశ్వర్‌ పట్టణంలోని దేశాయ్‌ ప్రాంతానికి చెందిన అశోక్‌ మహదేవప్ప హంపన్నవర్‌ 2024 ఆగస్టు 1న అనారోగ్యంతో మరణించాడు. అతని సోదరుడు నాగరాజ్‌ మహదేవప్ప హంపన్నవర్‌ 2024 ఆగస్టు 9న తన సోదరుడు మరణ ధృవీకరణ పత్రం కోసం పట్టణ మున్సిపాల్టీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే మరణించిన అశోక్‌ మహదేవప్ప హంపన్నవర్‌ మరణ ధృవీకరణ పత్రం జారీ చేయడానికి బదులుగా జీవించి ఉన్న వ్యక్తి సోదరుడు నాగరాజ్‌ హంపన్నవర్‌ పేరిట బాధ్యతారహితంగా 2024 మార్చి 11న మరణ ధృవీకరణ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. నాగరాజ్‌ హంపన్నవర్‌ తన మరణ ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని గత 8 నెలలుగా మున్సిపాల్టీ చుట్టూ తిరుగుతున్నాడు. కానీ మరణ ధృవీకరణ పత్రం రద్దు కాలేదు. తాను బతికి ఉన్నా ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన సౌకర్యాలు అందలేదని నాగరాజ్‌ వాపోయాడు. మున్సిపాల్టీ జనన, మరణ నమోదు అధికారి మంజునాథ్‌ ముద్గల్‌ను కోరారు. దీంతో ఆయన సంబంధిత శాఖ సిబ్బందికి మరణ ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని వెంటనే నోటీసు జారీ చేశారు.

మున్సిపల్‌ అధికారుల

బాధ్యతారాహిత్యం బట్టబయలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement