అథ్లెటిక్స్‌కు ఎంపిక
హొసపేటె: కూడ్లిగి పట్టణంలోని జ్ఞాన భారతి విద్యామందిర్‌కు చెందిన కిరణ్ నాయక్, పి.భార్గవిలు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యారు. ఇటీవల విజయనగర జిల్లా హొసపేటె జిల్లా క్రీడా మైదానంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో లాంగ్‌జంప్‌లో కిరణ్, హైజంప్‌లో పి.భార్గవి ప్రతిభ కనబరచి ద్వితీయ స్థానంలో నిలిచారు. జ్ఞాన భారతి విద్యామందిర్ అధ్యక్షురాలు కేఎం.రూప, కార్యదర్శులు డాక్టర్.రవికుమార్ డైరెక్టర్ డాక్టర్.సౌమ్యశ్రీ, జీఆర్.రాజు, కిరణ్‌నాయక్ తదితరులు ఎంపికై న వారిని అభినందించారు.
పరిహారం కోసం ఆందోళన
రాయచూరురూరల్: కళ్యాణ కర్నాటక విభాగంలోని రైతులు పంట నష్ట పరిహారం ఇవ్వాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు చామరసమాలి పాటిల్ డిమాండ్ చేశారు. జిల్లా అధికారి కార్యాలయం వద్ద గురువారం ఆందోళన చేపట్టారు. చామరసమాలి మాట్లాడుతూ రైతు పండించిన పంటలకు మద్ధతు ధర ప్రకటించాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఖరీఫ్‌లో వరి, పత్తి, కంది, ఇతర పంటలు రైతులు నష్టపోయారని తెలిపారు. రాయచూరులో మిరపకాయల మార్కెట్‌ను ప్రారంభించాలన్నారు. మద్ధతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలని జిల్లా అధికారికి వినతిపత్రం సమర్పించారు.
ఔట్ సోర్స్ ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించాలి
హొసపేటె: సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్స్ ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఔట్ సోర్స్ ఉద్యోగుల సంఘం నేత మరడి జంబయ్య కోరారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూసాంఘిక, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీ సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్స్ కుక్‌లు, క్లీనర్లు, కిచెన్ అసిస్టెంట్లు, గార్డులు, జవాన్లు, నర్సులు జిల్లా అధికారి కార్యాలయం వద్ద శుక్రవారం ఆందోళన చేపట్టారు. అదనపు జిల్లా అధికారి బాలకృష్ణను వారు కలిసి వినతిపత్రం అందజేశారు. మరడి జంబయ్య మాట్లాడుతూ 15 ఏళ్లుగా చట్ట ప్రకారం ఔట్ సోర్స్ ఉద్యోగులు పోరాడుడుతున్నప్పటికీ సౌకర్యాలు కల్పించ లేదన్నారు. 90 శాతం మంది మహిళలు, పేదలు, ఒంటరి మహిళలు, వితంతువుల డిమాండ్లను తీవ్రంగా పరిగణించి నెరవేర్చాలన్నారు. ఈ సందర్భంగా హనుమ్‌గౌడ, రిమేష్‌కుమార్ , సత్యమూర్తి, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కనకదాసు ఆలోచనలు విలువైనవి
హొసపేటె: కనకదాసు ఆలోచనలు విలువైనవని, ఆయన సూత్రాలు, సూక్తులు జీవితంలో ఆచరించాలని ఎమ్మెల్యే డాక్టర్.ఎన్‌టి శ్రీనివాస్ అన్నారు. విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా హోసహళ్లి పట్టణంలోని కనకదాస సర్కిల్‌లో కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హాలుమత సమాజం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లా డుతూ సమ సమాజ పురోభివృద్ధికి కనకదాసు సూక్తులు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో హాలుమత సమాజం నాయకులు లక్కజ్జి మల్లికార్జున, మంజన్న, అహింద సిబి.నగేష్, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
అథ్లెటిక్స్‌కు ఎంపిక
అథ్లెటిక్స్‌కు ఎంపిక
అథ్లెటిక్స్‌కు ఎంపిక


