దళారుల చేతిలో నలిగిన రైతు
రాయచూరురూరల్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక రైతులు దళారుల చేతిలో నలిగిపోతున్నారు. గత ఏడాది ధర లేక ఇబ్బంది పడిన ఉల్లి రైతులు ఇపుడు దళారుల తీరుతో విసిగిపోతున్నారు. మార్కెట్‌కు తెచ్చిన సరకును కోనుగోలు చేయకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. రాయచూరు జిల్లా వ్యాప్తంగా 800 హెక్టార్లలో రైతులు ఉల్లి పంట సాగు చేశారు.
ప్రభుత్వం మద్ధతు ధర ప్రకటించడంతో రైతుల్లో అనందం వెల్లివిరిసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు వ్యవసాయ మార్కెట్‌కు ఉల్లి గడ్డలను తరలించారు.
తక్కువకు కొని....తరలింపు
రాయచూరు ఏపీఎంసీలో రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన దళారులు, వ్యాపారులు తమ దిగుబడులను గుజరాత్, పుణె, మహారాష్ట్ర, హైదరాబాద్, తమిళనాడుకు లారీలలో తరలించారు. అనంతరం ఉల్లి దిగుబడులను కొనుగోలు చేస్తామని ఏపీఎంసీ అధికారులు ముందుకువచ్చారు. దీంతో రైతులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీఎంసీకి దిగుబడులను తీసుకెళ్లారు. ఉన్నపాటుగా అధికారులు కొనుగోలు చేయకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. సంచికి రూ.400 ధర నిర్ధారించినా.. ఉల్లి కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు ఉల్లి దిగుబడులు తక్కువ ధరకే దళారులకు విక్రయించాల్సి వచ్చింది. వంద బస్తాల ఉల్లి సంచికి రూ.399 నుండి 440 వరకు పలకడంతో పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని రైతులు లబోదిబోమంటున్నారు.
ఏపీఎంసీలో కొనుగోలు చేయని అధికారులు
మహారాష్ట్ర, హైదరాబాద్‌కు తరలింపు
దళారుల చేతిలో నలిగిన రైతు


