వేతనాల కోసం వినతి | - | Sakshi
Sakshi News home page

వేతనాల కోసం వినతి

Nov 22 2025 7:20 AM | Updated on Nov 22 2025 7:22 AM

రాయచూరురూరల్‌: తుంగభద్ర ఎడమ కాల్వ పరిధిలో విధులు నిర్వహిస్తున్న తమకు వేతనాలు చెల్లించాలని కార్మిక శాఖ అధికారిణికి కార్మికులు వినతిపత్రం సమర్పించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక శాఖ జిల్లా అధికారి కార్యాలయం వద్ద గురువారం వారు ఆందోళన చేపట్టారు. కార్మికుడు నాగలింగస్వామి మాట్లాడుతూ యరమరాస్‌, కల్లూరు, అర్‌డీఎస్‌, కవితాళ, కొట్నేకల్‌, మస్కి, సింధనూరు, జవుళిగేర, తుర్విహాల్‌లోని కార్మికులకు ఐదు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్థుల ధర్నా

రాయచూరురూరల్‌: నగరంలోని బాలుర సాంఘిక సంక్షేమ శాఖ ఆధీనంలోని హాస్టల్‌లో పాడైన ఆహారం వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. అధికారుల తీరును నిరసిస్తూ విద్యార్థులు గురువారం ధర్నా చేపట్టారు. హాస్టల్‌లో వార్డెన్‌, ప్రిన్సిపల్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని రైతు సంఘం మహిళా అధ్యక్షురాలు రూపనాయక్‌ డిమాండ్‌ చేశారు.

ఉచితంగా మందుల పంపిణీ

హొసపెటె: ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపట్ల జాగ్రత్తలు పాటించాలని.. కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ ఎస్‌.లీలావతి తెలిపారు. హొసపెటె తాలూకాలోని బయలుతుంబర్గుడ్డి గ్రామంలోని ఆయుష్మాన్‌ హెల్త్‌ సెంటర్‌ను ఆమె తనిఖీ చేశారు. ఇంటింటా ఆరోగ్యం కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులు ప్రబలినపుడు వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచించారు. అనంతరం రక్తహీనత గల వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆశా కార్యకర్తలు గీత, శివగంగ, వీణ, తదితరులు పాల్గొన్నారు.

వేతనాలు చెల్లించాలి

రాయచూరురూరల్‌: గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు పాత బకాయిలు, వేతనాలు చెల్లించాలని గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ, ఎమ్మెల్పీ వసంత కుమార్‌ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. వీరేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న 36 వేల మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికీ నెల వేతనం రూ.36 వేలు చెల్లించాలన్నారు.

ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలి

రాయచూరురూరల్‌: కళ్యాణ కర్నాటక విభాగంలో ఖాళీగా వున్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని ఏఐడీఎస్‌ఓ అధ్యక్షుడు హయ్యళప్ప డిమాండ్‌ చేశారు. పాత జిల్లా అధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో హయ్యళప్ప మాట్లాడుతూ పాఠశాలలకు స్వీపర్‌ను నియమించి, కర్నాటక పబ్లిక్‌ పాఠశాలలను విలీనం చేయాలనే అంశాలను పునః పరిశీలించాలన్నారు. భవిష్యత్తులో 800 కర్నాటక పబ్లిక్‌ పాఠశాలలను ప్రారంభించి సర్కార్‌ బడులను మూసివేయడానికి ముందుకు వచ్చిందన్నారు. ఖాళీగా వున్న 22,595 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

నకిలీ డాక్టర్‌ అరెస్ట్‌

హోసూరు: ఆంగ్ల వైద్యం నిర్వహిస్తున్న నకిలీ డాక్టర్‌ను కావేరి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలిలా.. క్రిష్ణగిరి జిల్లా కావేరి పట్టణం సమీపంలోని కొసమేడు గ్రామానికి చెందిన తవమణి(56) అదే ప్రాంతంలో క్లీనిక్‌ నిర్వహిస్తూ రోగులకు ఆంగ్ల వైద్యం నిర్వహిస్తున్నాడు. తవమణి ప్లస్‌టూ వరకే చదివారని, అయినా వైద్యం చేస్తున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. వైద్యాధికారి నారాయణస్వామి నేతృత్వంలో అధికారులు గురువారం రాత్రి క్లీనిక్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులకు తవమణి ఆంగ్ల వైద్యం నిర్వహిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో క్లీనిక్‌కు సీల్‌ వేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కావేరిపట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

వేతనాల కోసం వినతి 1
1/4

వేతనాల కోసం వినతి

వేతనాల కోసం వినతి 2
2/4

వేతనాల కోసం వినతి

వేతనాల కోసం వినతి 3
3/4

వేతనాల కోసం వినతి

వేతనాల కోసం వినతి 4
4/4

వేతనాల కోసం వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement