అధికారులను బెదిరిస్తే చర్యలు
బళ్లారి రూరల్: మానవ హక్కుల సంఘం, పరిషత్తు, పోరాట సమితి పేరుతో అధికారులను బెదిరిస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మావన హక్కుల ఆయోగ తాత్కాలిక అధ్యక్షుడు టి.శ్యామ్‌భట్ తెలిపారు. దావణగెరె జడ్పీ సబా భవన్‌లో గురువారం జరిగిన కొత్త ిఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అర్హత ఉన్న వారికి పతకాల సౌలభ్యం కల్పించకపోవడం మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందన్నారు. ఏ ప్రభుత్వ శాఖౖపైనెనా బాధితులు నేరుగా ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు. తాను అధికారం తీసుకున్నాక ఆయోగంలో 5400 కేసులు ఉన్నాయని, ఆయా జిల్లాల్లో పర్యటించి 2000 కేసులను విచారించానని తెలిపారు. ఇంకా 3413 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అనంతరం దావణగెరె నగరంలోని వివిధ శాఖలు, హాస్టళ్లను ఆయన పరిశీలించి సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారి గంగాధరస్వామి, జడ్పీ సీఈఓ గిత్తమాధవ విఠ్ఠలరావు, ఎస్పీ ఉమా ప్రశాంత్, అదనపు జిల్లా అధికారి శీలవంత శివకుమార్ పాల్గొన్నారు.


