వీరభద్రేశ్వర జాతర ప్రశాంతం
రాయచూరురూరల్: నగరంలో వీరభద్రేశ్వర జాతర ఉత్సవాలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. బెస్తవారిపేట కోటలో వెలసిన కోల్‌కతా వీరభద్రేశ్వర ఆలయం నుంచి కిల్లే మఠం వీరభద్రేశ్వర దేవాలయం వరకు మహిళలు కలశాలు చేతబట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. చించోళి పురవంతులు వీర గాసే, నృత్యం చేస్తూ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం శాంత మల్లశివాచార్య జ్యోతి ప్రజల్వన చేయగా మహిళలు దీపాలు వెలిగించారు. శుక్రవారం తెల్లవారు జామున భక్తులు అగ్నిగుండంలో దిగి భక్తిని చాటుకున్నారు.
వీరభద్రేశ్వర జాతర ప్రశాంతం


