
ఆరోగ్యమాతా.. ఆలకించు మా మొర
శివాజీనగర: ఉద్యాననగరిలోని సెయింట్ బసిలికా మేరీ మాత చర్చి ప్రాంగణంలో ఆరోగ్యమాత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ఏటా ఆగస్టు 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 8 వరకు ఆరోగ్య మాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుండడం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే రిజ్వాన్ హర్షద్, మత గురువులు ఆరోగ్యమాత జెండావిష్కరణ చేసి ప్రార్థనలు జరిపి ఉత్సవాలను ప్రారంభించారు. ఆరోగ్యం, శాంతి సమాధానం, సమృద్ధికర జీవితాన్ని అనుగ్రహించమంటూ ఆరోగ్యమాతకు ప్రార్థనలు చేశారు. కొవ్వొత్తులను చేతపట్టుకొని మోకాళ్లపై మాత సన్నిధికి చేరుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. కాగా ఈ ఉత్సవాలకు భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి రావడం విశేషం. శనివారం ఉదయాన్నే 5.30 గంటల నుంచి ప్రార్థనలు ప్రారంభమవుతాయి.

ఆరోగ్యమాతా.. ఆలకించు మా మొర

ఆరోగ్యమాతా.. ఆలకించు మా మొర