
సాక్షి, కర్ణాటక: సాధారణంగా కోళ్లు తెలుపు, గోధుమ రంగుల్లో గుడ్లను పెడతాయి. కానీ, కర్ణాటకలో దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా నల్లూరు గ్రామంలోని సయ్యద్ మాలిక్ అనే రైతు ఇంట్లో నాటు కోడి నీలి రంగు గుడ్లను పెడుతోంది. వీటిని ఒక్కొక్కటి రూ.20కి పైగా చెల్లించి పలువురు కొనుగోలు చేస్తున్నట్లు మాలిక్ చెప్పాడు. వ్యవసాయ, పశుశాఖ అధికారులు కోడిని పరిశీలించారని, అది ఆరోగ్యంగానే ఉందని, ఆ గుడ్లను నిరభ్యంతరంగా తినవచ్చని చెప్పినట్లు తెలిపాడు. అయితే, ఆ కోడి ఎందుకు నీలి రంగు గుడ్లు పెడుతోందో నిర్థారణ కావల్సి ఉంది.