
పిల్లల్లో సాహిత్యాభిరుచి పెంపొందించాలి
రాయచూరు రూరల్: పిల్లల్లో విద్యకు తోడు సాహిత్యాభిరుచిని పెంపొందించాలని బాబు భండారిగళ్ అభిప్రాయ పడ్డారు. సోమవారం కన్నడ భవనంలో కర్ణాటక బాలల సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బాలల సాహిత్య కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మార్కులు తెచ్చి పెట్టే యంత్రాలుగా మార్చారని విచారం వ్యక్తం చేశారు. చదువుకొనే సాకుతో వారిలో ఉన్న ప్రతిభ, నైపుణ్యత నశించిపోతాయన్నారు. పిల్లల పోషణలో మానసికంగా, శారీరకంగా మనోధైర్యం కోల్పోతున్నారన్నారు. కార్యక్రమంలో కసపా అధ్యక్షుడు రంగన్న పాటిల్, రేఖ, వీర హనుమాన్, రామణ్ణ, అయ్యప్పయ్య, వెంకటేష్, దేవేంద్రమ్మలున్నారు.