నీ వెనుక ఎవరున్నారు? | - | Sakshi
Sakshi News home page

నీ వెనుక ఎవరున్నారు?

Aug 26 2025 7:58 AM | Updated on Aug 26 2025 7:58 AM

నీ వె

నీ వెనుక ఎవరున్నారు?

బనశంకరి: పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థలలో అత్యాచారాలు, మృతదేహాలు అని తీవ్ర సంచలనానికి కారణమైన ముసుగువ్యక్తి చిన్నయ్యను సిట్‌ అధికారులు, పోలీసులు విచారిస్తున్నారు. అతడు చెప్పినట్లు సుమారు 20 ప్రదేశాలలో తవ్వినా మృతదేహాల గుట్టలు బయటపడలేదు. దీంతో ఇప్పుడు చిన్నయ్య మీద విచారణ ఊపందుకుంది. ఈ కుట్రలో నీతోపాటు ఎవరెవరి పాత్ర ఉంది అనేది చిన్నయ్యను ప్రశ్నించినట్లు తెలిసింది. తనతో సంబంధం కలిగిన కుట్రదారులు, సూత్రధారుల జాబితా ను పోలీసులకు ఇచ్చాడని తెలిసింది. వీలైతే వారిని కూడా అరెస్టు చేయాలని సిట్‌ సిద్దమైంది. తొందరపాటు లేకుండా చట్టపరంగా ఒక్కో సూత్రధారిని అరెస్ట్‌ చేయాలని సిట్‌ భావిస్తోంది. ధర్మస్థల కు వ్యతిరేకంగా కుట్రదారులు ఎవరున్నారు అనేది త్వరలో బయటపడే అవకాశముంది.

2023 డిసెంబరు నుంచి..

చిన్నయ్య 2023 డిసెంబరు నుంచి ధర్మస్థల వ్యతిరేక కార్యకలాపాల్లో నిమగ్నమైనట్లు తెలిసింది. అతని వెనుక ఉన్న గ్యాంగ్‌ను కనిపెట్టేపనిలో ఉన్నారు. ధర్మస్థల అడవిలో ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి తలను కత్తితో వేరుచేసి ఆ పుర్రెను రహస్యంగా తీసుకెళ్లి గ్యాంగ్‌ ఆదేశాల మేరకు కలిసిన పెద్ద వ్యక్తి ఎవరనేది తేలాల్సి ఉంది. అతని కోసం పోలీసులు శోధిస్తున్నారు. జూలై 3వ తేదీన న్యాయవాదితో కలిసి ముసుగువ్యక్తి దక్షిణకన్నడ జిల్లా ఎస్పీ ఆఫీసుకు వెళ్లి ధర్మస్థలలో అనేక దురాగతాలు జరుగుతున్నాయని చెప్పాడు. ఈ పుర్రెను సాక్షిగా పరిగణించాలని చెప్పాడు. ఢిల్లీ ముఠా దీని వెనుక ఉన్నట్లు గట్టి అనుమానాలు ఉన్నాయి. సిట్‌ విచారణలో ఆ పుర్రె ధర్మస్థల అడవిలో ఒక అస్థిపంజరానిదని తేలింది. ఆ విషయంలోనూ చిన్నయ్య ను తీవ్రంగా విచారిస్తున్నారు.

భార్య మల్లిగే విచారణ

సిట్‌ అధికారులు తమిళనాడులో చిక్కరసంపాళ్య గ్రామానికి వెళ్లి చిన్నయ్య భార్య మల్లిగే ని విచారించారు. ఆదివారం సత్యమంగలం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి స్థానిక పోలీసులతో కలిసి చిన్నయ్య ఇంటికి వెళ్లారు. భార్య మల్లిగే మాట్లాడుతూ పనికి పోతున్నానని చెప్పి రెండు నెలల కిందట వెళ్లాడు. ధర్మస్థలలో ఉన్నట్లు టీవీల ద్వారా తెలిసిందని ఆమె చెప్పారు. తనకు ఫోన్‌ చేసిన చిన్నయ్య నేను న్యాయవాది వద్ద ఉన్నాను, తొందరగా వస్తానని చెప్పాడని తెలిపింది. టీవీలలో వస్తున్న అంశాలను ప్రశ్నించగా, వచ్చిన తరువాత అన్నీ చెబుతానని, భయపడవద్దని చెప్పాడంది. 17 ఏళ్ల క్రితం తమకు పెళ్లయిందని, మొదట్లో ధర్మస్థలలో ఉంటూ పౌరకార్మికురాలిగా పనిచేశానని తెలిపింది. పదేళ్ల క్రితం సత్యమంగలంలో స్థిరపడ్డామని , గార్మెంట్స్‌ మిల్లులో పనిచేస్తున్నట్లు చెప్పింది. నా భర్త ఎందుకు ఇలా చేస్తున్నాడో, అతనికి ధర్మస్థల మంజునాథస్వామి దారి చూపిస్తాడని, ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి వస్తాడనే నమ్మకం ఉందన్నారు. తమకు ఎలాంటి కుట్రలు కుతంత్రాలు తెలియవని పేర్కొంది.

సెప్టెంబరు 1న ధర్మస్థలలో బీజేపీ సభ

శివాజీనగర: ధర్మస్థల కేసును ఎన్‌ఐఏ తనిఖీకి అప్పగించాలంటూ సెప్టెంబర్‌ 1న ధర్మస్థలలో భారీ సభను బీజేపీ నిర్వహించనుంది. బెంగళూరులో బీజేపీ ఆఫీసులో పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర మాట్లాడారు. సోషల్‌ మీడియాలో ధర్మస్థలపై నిరంతరం అప ప్రచారం జరిగింది. తప్పుచేసిన వారికి శిక్ష పడేలా ఎన్‌ఐఏకు దర్యాప్తును అప్పగించాలని డిమాండ్‌ చేశారు. సిట్‌ విచారణ చేయాలని సీఎం సిద్దరామయ్యపై ఎవరో ఒత్తిడి తెచ్చారన్నారు. సిట్‌ విచారణ తొందరపాటు చర్య అన్నారు. చలో ధర్మస్థల జరిపి భారీ సభను నిర్వహిస్తామని చెప్పారు.

తీవ్ర మలుపు తిరిగిన ధర్మస్థలలో తవ్వకాల వ్యవహారం

బీజేపీ చలో ధర్మస్థల యాత్రలో పాల్గొన్న కార్లు

దోచేస్తున్న సైబర్‌ నేరగాళ్లు

చిన్నయ్యపై సిట్‌ ప్రశ్నల వర్షం

వారి కోసం అన్వేషణ

బీజేపీ చలో ధర్మస్థల

బనశంకరి: ధర్మస్థలపై నిందలు వేయడాన్ని వ్యతిరేకిస్తూ బెంగళూరు దక్షిణ బీజేపీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ధర్మస్థల చలో యాత్ర ప్రారంభమైంది. దక్షిణ ఎంపీ తేజస్విసూర్య, బసవనగుడి ఎమ్మెల్యే రవిసుబ్రమణ్య యాత్ర ను ప్రారంబించారు. జయనగర ఎమ్మెల్యే సీకే.రామమూర్తి నేతృత్వంలో వినాయక ఆలయంలో పూజలు చేసి వందలాది కార్లతో బయల్దేరారు. ధర్మస్థల దేవస్థానంపై జరుగుతున్న కుట్ర బయటకు రావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని వారు డిమాండ్‌ చేశారు.

21 రోజుల్లో రూ.11.15 కోట్లు స్వాహా

షేర్ల పేరుతో లూటీపర్వం

అమాయకులు లబోదిబో

బెంగళూరులోనే అధికం

నీ వెనుక ఎవరున్నారు?1
1/5

నీ వెనుక ఎవరున్నారు?

నీ వెనుక ఎవరున్నారు?2
2/5

నీ వెనుక ఎవరున్నారు?

నీ వెనుక ఎవరున్నారు?3
3/5

నీ వెనుక ఎవరున్నారు?

నీ వెనుక ఎవరున్నారు?4
4/5

నీ వెనుక ఎవరున్నారు?

నీ వెనుక ఎవరున్నారు?5
5/5

నీ వెనుక ఎవరున్నారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement