
బీఎంటీసీ బస్సు తగిలి బాలుడు బలి
యశవంతపుర: బెంగళూరులో బీఎంటీసీ బస్సులు నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. బస్సు కింద పడి బాలుడు చనిపోయిన ఘటన బెంగళూరు కేఆర్ మార్కెట్ వద్ద జరిగింది. అర్చకుడు దిలీప్ కుమార్, కొడుకు శబరీశ్ (10)తో కలిసి పూలు పండ్లు తేవడానికి స్కూటర్‌లో కేఆర్ మార్కెట్‌కు వెళుతున్నారు. పక్కనే వెళ్తున్న సిటీ బస్‌కు స్కూటర్ తగలడంతో అదుపుతప్పి పడిపోయింది. బాలుడు మీద నుంచి వెనుక బస్సు వెనుక చక్రాలు దూసుకెళ్లాయి. తల ఛిద్రమైన బాలుడు అక్కడే మరణించాడు. హలసూరు గేట్ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాల ప్రకారం డ్రైవరు తప్పిదం లేదని చెబుతున్నారు.
పాకిస్థాన్ సంస్థపై
ముస్లింల ఫిర్యాదు
తుమకూరు: పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ కార్యకలాపాలు తుమకూరులో జరుగుతున్నాయి. ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మర్కజ్జీ ముషావ్రత్ సంస్థ నేతృత్వంలో తుమకూరు ముస్లింలు జిల్లా అదనపు ఎస్పీ గోపాల్ పురుషోత్తంకి వినతిపత్రమిచ్చారు. ముస్లిం నేతల ఆధ్వర్యంలో వందలాది మంది వెళ్లి కలిశారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ సంస్థ తుమకూరులో చురుగ్గా ఉందని తెలిపారు. మేము ఈ సంస్థకు సహకరించము అని చెప్పారు. శాంతిభద్రతలను కాపాడటానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మౌలానా జియా, ఉర్ రెహమాన్, నస్రుల్లా, అబూబకర్, బిలాల్ తదితరులు ఉన్నారు.
బాను ముష్తాక్‌కు
ఎమ్మెల్యే మద్దతు
● మైసూరు దసరా వ్యవహారం..
మైసూరు: ఈ ఏడాది దసరా ఉత్సవాలను రచయిత్రి బాను ముష్తాక్ ప్రారంభిస్తే తప్పేమిటని మైసూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్‌సేట్ అన్నారు. మాజీ ఎంపీ ప్రతాపసింహ అభ్యంతరం చెప్పడంపై సోమవారం మండిపడ్డారు. గతంలో కవి నిసార్ అహ్మద్ కూడా మైసూరు దసరా వేడుకలను ప్రారంభించారని తెలిపారు. సాహిత్య ప్రపంచంలో గుర్తింపు పొందిన బాను ముష్తాక్‌ను దసరా ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. భక్తిని ఎవరికీ చూపించడం కాదు. నేను చేసే పని నాకు సంతృప్తిని కల్గించాలి అని పేర్కొన్నారు. భవిష్యత్తులో మంచి జరగాలంటే ఓపిగా ఉండాలి. నిప్పంటించుకొని కాల్చుకోవడం సరికాదని ఆయన అన్నారు. ధర్మస్థలపై దుష్ప్రచారం వెనుక కుట్ర ఉందని, మాస్కుమనిషిని విచారించాలన్నారు.
సరైన చోట జవాబిస్తా: బాను
దొడ్డబళ్లాపురం: దసరా ఉత్సవాల ప్రారంభోత్సవానికి ప్రముఖ రచయిత్రి బాను ముష్తాక్‌ను ప్రభుత్వం ఎంపిక చేయడంపై బీజేపీ నేతలు మండిపడడం తెలిసిందే. ఈ విషయమై ఆమె స్పందిస్తూ తగిన సమయంలో, తగిన వేదిక మీద సమాధానమిస్తానన్నారు. గతంలో నేను ఏం మాట్లాడానో సరిగా తెలుసుకుని నన్ను విమర్శించడం మంచిదన్నారు. నన్ను వ్యతిరేకించడం వారి హక్కు అని అన్నారు. వారి విమర్శలపై ఇప్పుడు స్పందించనని తెలిపారు.

బీఎంటీసీ బస్సు తగిలి బాలుడు బలి