
పురాణ శ్రవణంతో శాంతి సౌభాగ్యం
రాయచూరు రూరల్: సమాజంలో మానవుడు పురాణాలు వినడంతో శాంతి సౌభాగ్యం లభిస్తుందని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పేర్కొన్నారు. సోమవారం కిల్లే బృహన్మఠంలో ఏర్పాటు చేసిన శ్రావణమాస ముగింపు నాగలింగేశ్వర పురాణ మంగళ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలో శాంతి, సౌహార్దత్వం, సామరస్యం కావాలంటే అందరినీ గౌరవించడం మన సంప్రదాయమన్నారు. పిల్లలకు సంస్కృతి, ఆచార, విచారాలు, భక్తి సంప్రదాయాలు నేర్పాలన్నారు. సమావేశంలో కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, శాసన సభ్యులు బసనగౌడ, శివరాజ్ పాటిల్, నగరసభ సభ్యులు జయన్న, దరూరు బసవరాజ్, శాంతప్ప, శివమూర్తి, రుద్రప్పలున్నారు.