
దళపతులకు వేతనాలు ఇవ్వండి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న దళపతులకు రూ.10 వేల చొప్పున వేతనాలు చెల్లించాలని అఖిల కర్ణాటక దళపతుల సంఘం అధ్యక్షుడు శరభనగౌడ డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 ఏళ్ల నుంచి గ్రామాల్లో దళపతులుగా పని చేస్తున్నా తమకు పారితోషికం లేదన్నారు. దేవరాజ్ అరసు హయాంలో నియమితులైన వారికి గౌరవధనం లేదన్నారు. ప్రస్తుత హోంశాఖ మంత్రి పరమేశ్వర్ ఈ విషయంలో సానూకులంగా స్పందించి న్యాయం జరిగేలా ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.