
మరో 5 గజరాజులు రాక
సోమవారం మైసూరు ప్యాలెస్‌కు చేరిన ఐదు గజరాజులు
● మైసూరులో ఘన స్వాగతం
మైసూరు: ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో పాల్గొనేందుకు మరో 5 ఏనుగులు సోమవారం రాచనగరికి వచ్చాయి. ఇప్పటికే 9 ఏనుగులు వచ్చి సంబరాలకు తర్ఫీదు పొందుతున్నాయి. వివిధ అడవుల్లోని శిబిరాల నుంచి శ్రీకంఠ (56), రూపా (44), గోపీ (42), సుగ్రీవ (43), హేమావతి (11) అనే ఏనుగులను ప్రత్యేక వాహనాలలో తీసుకొచ్చారు. సాయంత్రం అంబావిలాస్ ప్యాలెస్‌కు చేరుకొన్నాయి. జయ మార్తాండ ద్వారం వద్ద డీసీఎఫ్ ప్రభుస్వామి, ప్యాలెస్ డైరెక్టర్ సుబ్రమణ్య, అర్చకులు ఏనుగులకు విశేష పూజలు చేసి స్వాగతం పలికారు. మంగళవారం నుంచి అన్ని ఏనుగులు తాలీములో పాల్గొంటాయి.

మరో 5 గజరాజులు రాక